Asianet News TeluguAsianet News Telugu

స్వాతంత్య్ర దినోత్స‌వం నాడు దేశం స‌మిష్టి శ‌క్తిని చూశాం - మ‌న్ కీ బాత్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

స్వాతంత్య్రం దినోత్సవం నాడు దేశం మొత్తం సమిష్టి శక్తిని అందరం చూశామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తన నెలవారి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

We saw the collective strength of the nation on Independence Day - PM Narendra Modi in Mann Ki Baat
Author
First Published Aug 28, 2022, 1:23 PM IST

ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో దేశప్రజలు పాల్గొనడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసించారు. దీనిని విజయవంతం చేసినందుకు జాతికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని తన నెల వారి ‘నెలవారీ మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.అమృత్ మహోత్సవ్, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని సమిష్టి శక్తిని అంద‌రం చూశామ‌ని చెప్పారు. 

‘‘ ఇంత పెద్ద దేశం, ఇన్ని వైవిధ్యాలు ఉన్నాయి, కానీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేటప్పుడు అందరూ ఒకే స్ఫూర్తితో నిలిచారు. ఆగస్టులో మీ లేఖలు, సందేశాలు, కార్డులు నా కార్యాలయాన్ని త్రివర్ణ పతాక ఛాయల్లో ముంచెత్తాయి. త్రివర్ణ పతాకాన్ని మోయని లేదా త్రివర్ణ పతాకం, స్వేచ్ఛ గురించి మాట్లాడని ఏ ఉత్తరాన్ని నేను చూడలేదు’’ అని ఆయన అన్నారు. స్వచ్ఛత, టీకాల ప్రచారంలో దేశ స్ఫూర్తిని చూశామని, అమృత్ మహోత్సవ్‌లో మళ్లీ అదే దేశభక్తి స్ఫూర్తిని చూడబోతున్నామని ఆయన అన్నారు. ఈ వేడుకలు వచ్చే ఏడాది  ఆగ‌స్టు 2023 వరకు కొనసాగుతుందని ప్రధాని మోడీ తెలిపారు.

బెలూన్‌లో గాలిని నింపే సిలిండర్‌ పేలి.. రెండ్లేండ్ల‌ చిన్నారి మృతి

‘‘ త్రివర్ణ పతాకం ప్రచారం కోసం ప్రజలు వివిధ వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చారు. ఒక పజిల్ కళాకారుడు రికార్డ్ టైంలో మొజాయిక్ కళ ద్వారా అందమైన త్రివర్ణ పతాకాన్ని సృష్టించారు. అస్సాం ప్రభుత్వ ఉద్యోగులు 20 అడుగుల త్రివర్ణ పతాకాన్ని సృష్టించారు ’’ అని ఆయన తెలిపారు. అమృత్ మహోత్సవ్ రంగులు భారతదేశంలోనే కాకుండా, ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా కనిపించాయని ప్రధాని నొక్కి చెప్పారు. కాగా.. బోట్స్ వానాలోని నివసిస్తున్నస్థానిక గాయకులు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 దేశభక్తి గీతాలను ఆలపించారు.

అమృత్ సరోవర్ అభియాన్ విషయాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ.. ఈ రోజు అమృత్ సరోవర్ నిర్మాణం ఒక ప్రజా ఉద్యమంగా మారిందని అన్నారు. ఈ ప్రచారంతో చాలా చోట్ల పాత చెరువులను కూడా పునరుద్ధరిస్తున్నారని తెలిపారు. అమృత్ స‌రోవ‌ర్ అభియాన్ ఈ రోజు మ‌న అనేక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డమే కాదు, రాబోయే త‌రాల‌కు కూడా అంతే ఉప‌యోక‌రంగా ఉంటుంద‌ని చెప్పారు. ‘‘ మీరందరూ, ముఖ్యంగా నా యువ మిత్రులు, అమృత్ సరోవర్ ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని, నీటి సంరక్షణకు సంబంధించిన ఈ ప్రయత్నాలకు పూర్తి శక్తిని అందించాలని, ఇందులో చురుకుగా పాల్గొనాల‌ని నేను అభ్యర్థిస్తున్నాను. ’’ అని మోడీ అన్నారు. 

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పోషకాహార లోపాన్ని కూడా త‌న రేడియో ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో అనేక పండుగలతో పాటు పౌష్టికాహారానికి సంబంధించిన ప్రచారాన్ని కూడా  నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మ‌నం ప్రతీ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోషణ్ మాహ్ జరుపుకుంటామని ఆయ‌న చెప్పారు. ఇందులో భాగంగా పోషకాహార లోపానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక సృజనాత్మక ప్రచారాలు జరుగుతుయాని, దీని ద్వారా పోషకాహార లోపం, దాని నివార‌ణకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌వ‌చ్చ‌ని చెప్పారు. 

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆనంద్ మహీంద్రా రిక్వెస్ట్.. దేని గురించి అంటే?

డిజిటల్ ఇండియా ప్రచారంపై ప్ర‌ధాని మాట్లాడుతూ.. “ ఒకప్పుడు పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న సౌకర్యాలను డిజిటల్ ఇండియా ప్రతి గ్రామానికి తీసుకువచ్చింది. దీని వ‌ల్ల కొత్త డిజిటల్ పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారు. అరుణాచల్, ఈశాన్య మారుమూల ప్రాంతాలలో 4G రూపంలో కొత్త సూర్యోదయం వ‌చ్చింది. అక్క‌డ ఇంటర్నెట్ కొత్త ఉదయాన్ని తీసుకువచ్చింది. ’’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios