Asianet News TeluguAsianet News Telugu

నిందితులు ఎవరైనా వదిలిపెట్టం.. చట్ట ప్రకారం శిక్షిస్తాం - ఢిల్లీ స్కూటీ యాక్సిడెంట్ పై స్పందించిన కేజ్రీవాల్

ఢిల్లీలో వెలుగు చూసిన స్కూటీ యాక్సిడెంట్ పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఎవరినైనా వదిలపెట్టబోమని అన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న వారైనా కూడా చట్ట ప్రకారం శిక్షిస్తామని తెలిపారు. 

We have left any of the accused.. we will punish according to the law - Kejriwal reacts on Delhi scooty accident
Author
First Published Jan 2, 2023, 4:42 PM IST

స్కూటీని ఢీకొట్టి, కారు కింద ఇరుక్కుపోయిన మహిళ మృతదేహాన్ని తీయకుండా అలాగే నాలుగు కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అది అమానవీయం అని, చాలా అరుదైన నేరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిందితులు ఎవరైనా వదిలిపెట్టబోమని, వారిని కఠినంగా శిక్షించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను అభ్యర్థించారు. 

ఉక్రెయిన్‌తో రష్యా వ్యవహరించినట్టే.. భారత్‌తో చైనా విధానం.. సరిహద్దు ఘర్షణలను ప్రస్తావించిన రాహుల్ గాంధీ

సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ డిపోలో 50 ఎలక్ట్రిక్ బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు ప్రమాదాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. ‘‘ ఇది అరుదైన నేరాలలో అరుదైనది. సమాజం ఎటువైపు వెళుతుందో నాకు అర్థం కావడం లేదు. ఆమెకు ఈ సమయంలో పోస్టుమార్టం జరుగుతోంది’’ అని ఆయన అన్నారు. 

‘‘ కంఝవాలా ఘటనపై ఎల్‌జీతో మాట్లాడాను. దోషులపై  చర్యలు తీసుకోవాలని, వారిపై ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్)లోని కఠిన సెక్షన్లు ప్రయోగించాల్సిందిగా అభ్యర్థించారు. నిందితులు రాజకీయంగా ఉన్నత సంబంధాలున్నప్పటికీ కనికరం చూపబోము. కఠిన చర్యలు తీసుకుంటాం ’’ అని అన్నారు. కాగా.. అంతకు ముందు కేజ్రీవాల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఘటన సిగ్గుచేటని, దోషులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. ‘‘ కంఝవాలాలో మా సోదరికి జరిగింది చాలా సిగ్గుచేటు. దోషులను కఠినంగా శిక్షిస్తారని నేను ఆశిస్తున్నాను’’ అని హిందీలో ట్వీట్ చేశారు.

ఈ ఘటనను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కూడా ఖండించారు. ‘‘ ఈరోజు ఉదయం కంఝావ్లా-సుల్తాన్‌పురిలో జరిగిన అమానవీయ నేరం వల్ల నేను సిగ్గుతో తలదించుకున్నాను. నేరస్థుల క్రూరమైన ప్రవర్తనతో నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ విషయంలో ఢిల్లీ సీపీతో  మాట్లాడాను. నిందితులను పట్టుకున్నారు. అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు’’ అంటూ సక్సేనా ఆదివారం రాత్రి ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. 

రాష్ట్రంలో మ‌ళ్లీ అధికారం మాదే.. : కర్ణాటక సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై

కాగా.. న్యూ ఇయర్ రోజు తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూటీని కారు ఢీకొట్టింది. స్కూటీ నడుపుతున్న యువతి కారు కింది భాగంలో చిక్కుకుపోయింది. ఆ కారు అలాగే కొన్ని కిలోమీటర్ల మేర ఆమె బాడీని ఈడ్చుళ్లింది. ఆ యువతి మరణించింది. బాధితురాలి టూ వీలర్ ను కారు ఢీకొట్టడంతో ఆమె మృతదేహం ఆదివారం ఔటర్ ఢిల్లీలోని సుల్తాన్‌పురి నుంచి కంఝవాలా వరకు నాలుగు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిందని పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు.

ఈ ఘటనపై పలువురు పోలీసులకు సమాచారం అందించారు. ఓ మహిళ మృతదేహాన్ని కారు ఈడ్చుకెళ్తోందని పోలీసు కంట్రోల్ రూమ్ కు కాల్ చేసి చెప్పారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ మహిళ శరీరంపై బట్టలు లేకుండా, కాళ్లు విరిగి ఉన్నాయి. దీంతో ఆ మహిళపై అత్యాచేసి చంపి ఉంటారనే వాదనలు వచ్చాయి. కానీ ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్‌ పొడిగింపు.. త్వరలో మరో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న ఈడీ..!

ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ స్పందించారు. బాధిత మహిళపై లైంగిక వేధింపులు జరిగాయా ? నిందితులకు నేర చరిత్ర ఉందో లేదో స్పష్టం చేయాలని పోలీసులను కోరారు. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో ప్రమేయం ఉందని భావిస్తున్న దీపక్ ఖన్నా (26), అమిత్ ఖన్నా (25), క్రిషన్ (27), మిథున్ (26), మనోజ్ మిట్టల్ ను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 279 (ర్యాష్ డ్రైవింగ్), 304-ఏ (నిర్లక్ష్యం వల్ల మరణం) కింద కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios