Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్‌ పొడిగింపు.. త్వరలో మరో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న ఈడీ..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు,విజయ్ నాయర్,అభిషేక్ బోయినపల్లిలకు జ్యుడీషియల్ రిమాండ్ గడువును న్యాయస్థానం ఈ నెల 7 వరకు పొడిగించింది. 

delhi Excise policy case accused remand extended
Author
First Published Jan 2, 2023, 3:48 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు,విజయ్ నాయర్,అభిషేక్ బోయినపల్లిలకు గతంలో కోర్టు విధించిన రిమాండ్ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితుల కస్టడీని పెంచాలని కోరుతూ సీబీఐ  కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. దీంతో నిందితుల జ్యుడీషియల్ రిమాండ్ గడువును న్యాయస్థానం ఈ నెల 7 వరకు పొడిగించింది. 

ఇక, ఈ కేసులో ఇప్పటికే ఇండోస్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు‌ పాత్రపై ఈడీ అధికారులు చార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి మరో చార్జ్‌షీట్‌ను జనవరి 5వ తేదీన ఈడీ దాఖలు చేసే అవకాశం ఉంది. సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఈడీ అధికారులు.. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి‌లతో పాటు తదితరుల పేర్లను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios