కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలనేదే తమ లక్ష్యమని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 


కోల్‌కతా: కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలనేదే తమ లక్ష్యమని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై బెంగాల్ సీఎం మమత బెనర్జీతో సమావేశమైన తర్వాత సోమవారం నాడు ఆయన కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చిన్న విషయం కాదన్నారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటే ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే పూర్తి ప్రణాళికతో ముందుకొస్తామని చెప్పారు.

ప్రాంతీయ పార్టీలతో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. దేశ రాజకీయాలపై మమత బెనర్జీతో చర్చించినట్టు కేసీఆర్ తెలిపారు. ఫఎడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేసినట్టు కేసీఆర్ చెప్పారు.

సంబంధిత వార్తలు

బెంగాల్ సీఎం‌ మమతతో కేసీఆర్ భేటీ