తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు కోల్‌కతాలో  పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీతో సమావేశమయ్యారు.  

కోల్‌కతా: తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీతో సమావేశమయ్యారు. 

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చించేందుకు గాను కేసీఆర్ రెండో సారి మమత బెనర్జీతో సమావేశమయ్యారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటు చేయనున్నట్టు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశమయ్యారు.

నవీన్ పట్నాయక్‌తో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించారు. ఒడిశా నుండి బెంగాల్ సీఎంతో సమావేశమయ్యేందుకు గాను కేసీఆర్ కోల్‌కతాకు వెళ్లారు.