Asianet News TeluguAsianet News Telugu

మోడీ పుట్టిన రోజు సందర్భంగా రేపు బంగారు ఉంగరాల పంపిణీ.. ఎక్కడో.. ఎవరికో తెలుసా?

ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా రేపు జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలను పంపిణీ చేయాలని బీజేపీ ప్లాన్ చేసింది. తమిళనాడు బీజేపీ యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఉంగరం రెండు గ్రాములు ఉండనుంది.
 

gold rings to distributed by tamilnadu bjp on the occassion of pm narendra modi birthday
Author
First Published Sep 16, 2022, 3:23 PM IST

చెన్నై: తమిళనాడులో బీజేపీ వేళ్లూనుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలుమార్లు తమిళనాడులో పర్యటించినా చాలా సార్లు నిరసన సెగలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, తమిళనాడు బీజేపీ యూనిట్ ఈ సారి ప్రధాని మోడీ పుట్టిన రోజును వినూత్నంగా నిర్వహిస్తున్నారు.

ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సెప్టెంబర్ 17. అందుకోసమే తమిళనాడు బీజేపీ యూనిట్ రేపు ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని బంగారు ఉంగరాలను పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ యూనిట్ తెలిపింది.

ఉంగరాలను పంపిణీ చేయడానికి ఆర్ఎస్ఆర్ఎం హాస్పిటల్‌ను ఎంచుకున్నట్టు బీజేపీ రాష్ట్ర మంత్రి ఎల్ మురుగన్‌కు తెలిపారు. ప్రతి బంగారు ఉంగరం రెండు గ్రాముల బరువు ఉండనుంది. ఈ ఉంగరాలను రేపు పుట్టిన శిశువులకు పంపిణీ చేస్తున్నారు. ఇది పార్టీ కోసం చేసే ఉచితాల స్కీం కాదని తెలిపారు. కానీ, శిశువులను స్వాగతించాలని పార్టీ భావిస్తున్నదని, అందుకే ఈ స్కీంను చేపడుతున్నట్టు వివరించారు. 

అక్కడ పది నుంచి 15 మంది శిశువులు జన్మించే అవకాశం ఉన్నదని పార్టీ భావిస్తున్నది.

అంతేకాదు, ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా 730 కిలోల చేపలను పంపిణీ చేయనున్నట్టూ తెలిపారు. ఈ ఏడాది పుట్టిన రోజుతో ప్రధాని మోడీ 73వ పడిలోకి వెళ్లుతారు. ఈ సందర్భంగా 720 కిలోల చేపలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. చేపల వినిమయాన్ని పెంచడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు వారు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios