Asianet News TeluguAsianet News Telugu

లవ్ బర్డ్స్ జాగ్రత్త.. బజరంగ్ దల్ స్ట్రాంగ్ వార్నింగ్..

వాలెంటైన్స్ డే (Valentines Day)ను బహిష్కరించాలని బజరంగ్ దల్ (Bajrang Dal) పిలుపునిచ్చింది. పశ్చాత్త సంస్కృతిని విడనాడాలని కోరింది. యువత భారతీయ విలువలు, సంస్కృతీ సంప్రదాయాలు పాటించాలని పిలుపునిచ్చింది.

We are boycotting Valentine's Day: Bajrang Dal warns..ISR
Author
First Published Feb 14, 2024, 10:18 AM IST | Last Updated Feb 14, 2024, 10:18 AM IST

నేడు వాలెంటైన్స్ డే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేమికులకు ఈ రోజు ఎంతో ప్రత్యేకం. చాలా మంది ప్రేమికులు నేడు తమ ఫీలింగ్స్ ను పార్టనర్ తో వ్యక్తం చేస్తారు. ఉల్లాసంగా గడుపుతారు. ఈ నేపథ్యంలో బజరంగ్ దల్ ఓ కీలక ప్రకటన చేసింది.  విదేశీ విష సంస్కృతిని వ్యాప్తి చేస్తున్న ఈ వాలెంటైన్స్ డేను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.

గుండు చేసి, మీసాలు తొలగించి.. మెడికల్ స్టూడెంట్లపై సీనియర్ల శాడిజం

ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ బాలస్వామి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. వాలెంటైన్స్ డేను అడ్డుకొని తీరుతామని తేల్చి చెప్పారు. విదేశీ విష సంస్కృతిని విడనాడాలని కోరారు. భారతీయ విలువలు, సంస్కృతీ సంప్రదాయాలు పరిరక్షించాలని కోరారు. ప్రేమ పేరుతో అశ్లీలతను ఒలకబోసే ఈ లవర్స్ డేను బహిష్కరించాలని కోరారు. యువత ఈ కార్పొరేట్ శక్తుల పన్నిన వలలో పడొద్దని సూచించారు. వారి కుట్రలకు బలి కావొద్దని కోరారు. 

భర్తను స్టేషన్ లో బంధించి.. భార్యపై కానిస్టేబుల్ లైంగిక దాడి.. దాచేపల్లిలో ఘటన

వాలెంటైన్స్ డేను అడ్డుకునేందుకు బజరంగ్ దల్ సిద్దంగా ఉందని అన్నారు. క్లబ్స్, పబ్స్, పార్కులు, సినిమా థియేటర్లు వంటి ప్రదేశాల్లో కల్తీ ప్రేమను ఒలకబోసే ఈ దుర్మార్గమైన చర్యను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా దాడి జరిగిందని, కాబట్టి నేడు ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios