నీటి సమస్య ఉందని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు తల్లిదండ్రులు..

జిల్లాలో తుంగభద్రా నది ప్రవహిస్తుండగా గుక్కెడు నీటి కోసం నిత్యం పోట్లాటలు తప్పడం లేదు. గ్రామం లోని రెండో వార్డులో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. 

water problem leads marriage cancel in karnataka

దావనగెరె : నీటి కోసం నిత్యం పోట్లాట.. వర్షాకాలంలోనూ గొంతు తడుపుకునేందుకు ఆరాటం...వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని బీతిల్లుతున్న జనం.. సమస్యను చూసి ఆ గ్రామంలోని యువకుడితో పెళ్లిని రద్దు చేసుకున్న యువతి తల్లిదండ్రులు.. రాష్ట్రంలో తాగునీటి సమస్య లేనేలేదని పాలకులు గొప్పలు చెప్పుకుంటుండగా, సమస్య తీవ్రంగా పీడిస్తున్నాఆ దిశగా పల్లెత్తు మాట కూడా మాట్లాడని విపక్షాలు...Davanagere జిల్లాలోని హరి హర  తాలూకా  మల్లె  బెన్నూర్ గ్రామంలో Drinking water problem తీవ్రరూపం దాల్చింది.

పెళ్లి సంబంధం కలుపుకునేటపుడు ఇటేడు తరాలు, అటేడు తరాలు చూడాలని పెద్దలు చెప్పేవారు. అయితే ఈ రోజుల్లో అలాంటి ఆచరణ అయ్యే అవకాశమే లేదు. కాకపోతే కళ్లముందు కనిపిస్తున్న సమస్యను చూస్తూ చూస్తే తమ పిల్లల గొంతు కోయలేమని నిర్ణయించుకునే సంఘటనలు మాత్రం అక్కడక్కడా కనిపిస్తున్నాయి. 

అలాంటిదో కర్ణాటకలో ఓ గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలోని నీటి సమస్య చూసి అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురిని కోరి కోరి అలాంటి కష్టాల్లోకి నెట్టడం ఇష్టం లేక.. పెళ్లి సంబంధాలు  క్యాన్సిల్ చేసుకున్నారు. దీనికి కారణం ఆ కుటుంబానిదా..? లేదా ప్రజలకు కనీస తాగునీరు అందించలేని పాలకులదా?

జిల్లాలో తుంగభద్రా నది ప్రవహిస్తుండగా గుక్కెడు నీటి కోసం నిత్యం పోట్లాటలు తప్పడం లేదు. గ్రామం లోని రెండో వార్డులో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. వాస్తవంలోకి వస్తే.. ఇటీవల గ్రామానికి చెందిన హాలేష్ అనే యువకుడికి Marital relationship కోసం భానుహళ్లికి  చెందిన యువతి తల్లిదండ్రులు గ్రామానికి వచ్చారు.

 ఆ సమయంలో నీటి కోసం గ్రామస్తులు Fighting కనిపించింది.  ఘర్షణకు  కారణమేమిటని  గ్రామస్తులను వాకబు చేయగా.. నీటికోసం ఇలా నిత్యం పోట్లాడుకోవడం తమకు సర్వసాధారణమని చెప్పారు. ఆ మాటలు విన్న యువతి Parents ఆలోచన మొదలైంది. మల్లె  బెన్నూర్ గ్రామం లోని యువకుడితో తమ కుమార్తె వివాహం జరిపిస్తే ఆమె కూడా నిత్యం గుక్కెడు నీటి కోసం పోరాడాల్సి వస్తుందేమోనని భయపడ్డారు.

జమ్మూకాశ్మీర్: ఓ పక్క అమిత్ షా పర్యటన.. కాల్పులకు తెగబడ్డ ముష్కరులు, ఓ పౌరుడు మృతి

గుడికి వెళ్ళిన తర్వాత యువకుడు ఇంటికి వెళ్లాలని తీసుకున్న తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.  ఆలయం నుంచి నేరుగా తాము తాము వచ్చిన దారిని వెనక్కి వెళ్లారు.  అదేమిటి అని కొందరు ప్రశ్నించగా.. నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉన్న గ్రామంతో తాము వియ్యం అందుకోవడం ఇష్టం లేదని తెగేసి చెప్పారట.

 పెళ్లి వారు వచ్చిన రోజు ఏమి జరిగిందంటే…
దాదాపు పదిహేను రోజుల తర్వాత ఆ రోజున తాగునీరు సరఫరా జరిగింది. నీటి కోసం మహిళలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. వారికి  పురుషులు కూడా సహకరించారు.  ఆ సమయంలోనే పెళ్లి వారు అక్కడికి వచ్చారు. రెండు నెలలుగా 15 రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా అవుతుందని గ్రామస్తులు ఆరోపించారు. తమ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని వాపోయారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios