మన దేశంలో పోర్న్ వెబ్ సైట్స్ పై నిషేధం విధించారు. కుప్పలు తెప్పలుగా ఉన్న అశ్లీలో వెబ్ సైట్స్ కారణంగా యువత చెడిపోతున్నారని.. అత్యాచారాలు ఎక్కువగా జరగడానికి ఈ వీడియోలు కారణమని భావించి వాటిపై పూర్తి నిషేధం విధించారు. కేంద్ర ప్రభుత్వం వాటిని పూర్తిగా నిషేధించినప్పటికీ.. ఇంకా విచ్చలవిడిగా కొన్ని వెబ్ సైట్లు ప్రత్యక్షమౌతున్నాయి.

వాటిని చూసే యువత కూడా వేలల్లో ఉంది. నిషేధం విధించినప్పటికీ  ఆ వీడియోల మోజులో పడి మునిగితేలుతున్న దాదాపు 600మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Also Read వివాహితతో రాసలీలలు: దుస్తులిప్పేసి నగ్నంగా ఊరేగించిన స్థానికులు...

దాదాపు 600మంది పోర్న్ వీడియోలను చూస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వీడియోలు చూస్తున్న వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా వారిని అరెస్టు కూడా చేయాలని వారు భావిస్తుండటం గమనార్హం. ఎవరెవరు ఇలాంటి వీడియోలు చూస్తున్నారో టెక్నాలజీ సహాయంతో ట్రాక్ చేసి.. వారి జాబితాను తయారు చేస్తున్నట్లు డీజీపీ రవి చెప్పారు. 

ఇప్పటి వరకు 600మందిని గుర్తించామని.. వారి పేర్లు, ఇంటి అడ్రస్ తో సహా జాబితా తయారు చేసినట్లు చెప్పారు. వారందరికీ ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు వారు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయనప్పటికీ.. త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.