ఆగ్రా: వివాహితతో రాసలీలల్లో నిండా మునిగి ఉన్న ఓ వ్యక్తిని స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత దుస్తులిప్పేసి నగ్నంగా వీధుల్లో ఊరేగించారు ఈ సంఘటన ఆగ్రాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఆ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అదే గ్రామంలోని మరో వివాహితతో అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరు సన్నిహితంగా ఉన్న సమయంలో మహిళ బావ వారిని పట్టుకున్నాడు. మహిళతో కలిసి ఉన్న వ్యక్తిని ఆ తర్వాత తంతూ, కొడుతూ నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. నాలుగు నిమిషాల వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. 

మహిళ బంధువు ఇచ్చిన రాతపూర్వకమైన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు, ఆతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ చెప్పారు. వ్యక్తిని నగ్నంగా వీధుల్లో తిప్పిన వీడియోను పరిశీలిస్తున్నామని, ఇందులో పాల్గొన్నవారిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.