కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా కొందరు నిరసనలు చేస్తుంటే.. మద్దుతుగా నిరసనలు చేసేవాళ్లు కూడా ఉన్నారు. సీఏఏకు అనుకూలంగా మధ్యప్రదేశ్ లో బీజేపీ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఓ బీజేపీనేత ఏకంగా మహిళా కలెక్టర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె జట్టుపట్టుకొని లాగాడు. దీంతో... ఆమె కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. చెంప పగలగొట్టింది.

Also Read బడా కంపెనీలో ఉద్యోగం మానేసి...రోడ్డుపై బిచ్చం ఎత్తుకుంటూ.....

పూర్తి వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్  లో ఇటీవల బీజేపీ కార్యకర్తలు  ఆదివారం సీఏఏకి మద్దుతగా ర్యాలీ చేపట్టారు. నిరసనకారులను అదుపుచేసేందుకు జిల్లా డిప్యుటీ కలెక్టర్ ప్రియాశర్మ రంగంలోకి దిగారు. ఆ కమ్రంలో ఆమెపై  బీజేపీ కార్యకర్తలు అసభ్యంగా ప్రవర్తించారు. విధుల్లో భాగంగా ఆందోళనకారులను చెదరగొడుతున్న ఆమెను ఓ బీజేపీ నేత జుట్టుపట్టుకొని లాగాడు. జట్టుపట్టుకొని ఆమెను వ్యాన్ ఎక్కించేందుకు ప్రయత్నించారు.

దీంతో వెంటనే అక్కడున్న రక్షణ సిబ్బంది కలెక్టర్ ను చుట్టుముట్టి కాపాడారు. అయితే కొద్దిసేటి తర్వాత ఆ పోరిని గుర్తదించిన ఆమె కాలర్ పట్టుకొని చెంప పగలగొట్టింది. విధుల్లో ఉన్న మహిళా అధికారిపై అసభ్యంగా ప్రవర్తిస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఘటనకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులపై కేసు కూడా నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.