బిచ్చగాడు సినిమా అందరూ చూసే ఉంటారు. అందుల్లో తన తల్లి ప్రాణాలు దక్కించుకునేందుకు ఓ కోటీశ్వరుడు బిచ్చగాడు అవతారం ఎత్తుతాడు. తన తల్లి బతకడం ఖాయమని తేలిన తర్వాత మళ్లీ తన కోటీశ్వరుడిగా మారిపోతాడు... ఇంచు మించు అలాంటి స్టోరీనే ఒడిశాలో చోటుచేసుకుంది. ఓ మంచి ఉన్నత కుటుంబంలో పెరిగిన వ్యక్తి.... బడా కంపెనీల్లో ఉద్యోగం చేసి.. చివరకు అన్నీ వదిలేసి రోడ్డుపై బిచ్చం ఎత్తుకుంటున్నాడు. ఓ రిక్షా వాడితో జరిగిన గొడవ కారణంగా ఆ బిచ్చగాడి గురించి తెలిసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... అతని పేరు గిరిజా శంకర్ మిశ్రా(51). పూరీలోని జగన్నాథ్ ఆలయం వద్ద అడుక్కుంటూ బతుకు ఈడుస్తున్నాడు. మాసిన బట్టలు, నెరిసిన గడ్డంతో దొరికిన రోజు తింటూ.. దొరకని రోజు పస్తులుంటూ ప్లాట్ ఫాంపైనే నిద్రిస్తూ ఉంటాడు. అయితే... ఆయన ఒక ఇంజినీర్ కావడం గమనార్హం.  ముంబయి, హైదరాబాద్ లోని పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేశాడు.

Also Read గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లోకి పాము.. వీడియో వైరల్...

ఆయన తండ్రి పోలీసు అధికారిగా పనిచేశాడు. బీఎస్సీ పూర్తిచేసిన తర్వాత సెంట్రల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీఐపీఈటీ)లో మిశ్రా ఇంజనీరింగ్‌ చదివాడు. ముంబైలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేశాడు. తర్వాత హైదరాబాద్‌కు వెళ్లి మిల్టన్‌ కంపెనీలో పనిచేశాడు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ.. పూరీకొచ్చి బిచ్చగాడిగా మారిపోయాడు.

ఇటీవల ఓ ఆటో రిక్షా వాడితో జరిగిన గొడవ కారణంగా అతను పోలీస్ స్టేషన్ కి రావాల్సి వచ్చింది. అప్పుడు అతని గురించి తెలిసి పోలీసులు నోరెళ్ల పెట్టారు.  అతను మాట్లాడిన ఇంగ్లీష్ కి పోలీసులు కంగుతిన్నారు. అంత చదువు చదివి ఇలా రోడ్డు మీద అడుక్కోవడం ఏమిటని పోలీసులు అడిగితే... అది తన పర్సనల్ విషయం అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.