సీఎం పోస్టు వద్దనే అనుకుంటున్నా..: అశోక్ గెహ్లాట్.. సచిన్ పైలటే టార్గెట్?

రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పోస్టు తనకు వద్దనే అనుకుంటున్నానని, కానీ, ఈ పోస్టు నన్ను వీడేలా లేదని వివరించారు. తనను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ఓ మహిళా కార్యకర్త తనకు చెప్పిందని గుర్తు చేశారు. రాజస్తాన్ కాంగ్రెస్‌లోని ప్రత్యర్థి గ్యాంగ్ సచిన్ పైలట్ వర్గాన్ని లక్ష్యంగా చేసుకునే గెహ్లాట్ ఈ కామెంట్లు చేశారు.
 

want to give up cm post says ashok gehlot targetting sachin pilot in rajasthan kms

జైపూర్: రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 25వ తేదీన ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీలో రెండు శిబిరాలున్న సంగతి తెలిసిందే. అంతర్గత కలహాలు నిత్యం బయటపడుతూనే ఉన్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ల క్యాంపులు ఉన్నాయి. పార్టీ హైకమాండ్ పలుమార్లు జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ ఇంకా నడుస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సందర్భంలోనే సీఎం అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో మీడియాతో అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. ‘ మహిళా కార్యకర్త నాతో మాట్లాడింది. నేను నాలుగో సారి ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉన్నదని చెప్పింది. నేను ఆమెతో ఒక మాట అన్నాను. నేను సీఎం పోస్టు వద్దనే అనుకుంటున్నాను. వదిలిపెట్టాలనే అనుకుంటున్నా. కానీ, ఆ సీటు నన్ను విడిచిపెట్టడం లేదు’ అని గెహ్లాట్ వివరించారు.

ఈ వ్యాఖ్యలను ఆయన చాలా తేలికగా మాట్లాడినప్పటికీ పార్టీలోనే ప్రత్యర్థిగా ఉంటున్న సచిన పైలట్ వర్గానికి మాత్రం భారీ పంచ్‌గా ఉండనుంది. సీఎం పదవి కోసం వీరద్దరి మధ్య కొన్నేళ్లుగా పోటీ నడుస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత సచిన్ పైలట్‌నే సీఎం చేస్తారేమో అన్నట్టుగా హైప్ వచ్చింది. కానీ, హైకమాండ్ గెహ్లాట్‌ను ఎంచుకుంది. సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం చేసింది. కానీ, వైరం ఆగలేదు. దీంతో 2020లో గెహ్లాట్ ప్రభుత్వం పై పైలట్ తిరుగుబాటు చేశారు.

Also Read: ఇజ్రాయెల్‌కు చేరిన బ్రిటన్ పీఎం రిషి సునాక్, యుద్ధం గురించి ఆయన ఏమన్నారంటే?

కాంగ్రెస్ హైకమాండ్ సకాలంలో స్పందించడంతో గెహ్లాట్ ప్రభుత్వం నిలబడింది. సచిన్ పైలట్ పార్టీ మారలేదు. అయితే, ఇప్పటికీ ఈ రెండు వర్గాల మధ్య వైరం ఉన్నది. ఈ సందర్భంలో ఆయన సచిన్ పైలట్‌కు తాకేట్టుగానే ఈ కామెంట్లు చేశారని అర్థం అవుతున్నది.

పైలట్ పై మరో కామెంట్ చేస్తూ.. రాష్ట్రానికి మూడు సార్లు సీఎంగా తననే హైకమాండ్ ఎంచుకున్నదని, తనలో హైకమాండ్ ఎక్కువ నమ్మకం పెట్టుకున్నదని గెహ్లాట్ వివరించారు. అభ్యర్థుల జాబితా విడుదల, సీఎం క్యాండిడేట్ ప్రకటించడకపోవడంపై బీజేపీ నుంచి విమర్శలు వస్తున్నాయని ప్రస్తావించగా.. ‘మేం గొడవపడటం లేదని బీజేపీ వాళ్లు బాధపడిపోతున్నారు. అన్ని నిర్ణయాలు ప్రతి ఒక్కరి అభిప్రాయాలను పరిశీలించే తీసుకుంటున్నాం. సచిన్ పైలట్ మద్దతుదారులతోనూ నేను మాట్లాడుతున్నాను. వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈ నిర్ణయాలు అన్నీ గడబిడ లేకుండా సాఫీగా జరిగిపోతున్నాయి. ఇది బీజేపీకి నచ్చడం లేదు’ అని గెహ్లాట్ పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios