బెంగళూరు: గర్ల్ ఫ్రెండ్ వీడియో కాల్ కోసం నగ్నంగా నిలబడి ఓ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. ఓ మహిళ కోసం వీడియో కాల్ లో యువకుడు దుస్తులు విప్పేశాడు. ఆ వీడియో కాస్తా నేరగాళ్ల ముఠాకు దొరికింది. దాంతో అతను రూ.22 వేలు వారికి సమర్పించుకున్నాడు. 

డబ్బులు ఇచ్చినా కూడా వీడియోను లీక్ చేస్తామని ముఠా బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెంగుళూరుకు చెందిన బాధితుడు నెల రోజుల క్రితం వాట్సప్ ద్వారా ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. తాను కేరళ నుంచి వచ్చానని, కాల్ సెంటర్ లో పనిచేస్తుంటానని ఆ యువతి అతన్ని నమ్మించింది. 

తాను గదిలో ఒక్కడినే ఉంటున్నానని, ఆ యువతి కోరిక మేరకు తాను ఇటీవల వీడియో కాల్స్ లో మాట్లాడానని అతను పోలీసులకు చెప్పాడు. వారం రోజుల కింద చాటింగ్ చేస్తున్నప్పుడు ఆమె తనను నగ్నమగా చూస్తానని అడిగిందని, అయితే తాను నిరాకరించానని, తాను కూడా అలా చేస్తానని చెప్పడంతో తాను దుస్తులు విప్పేశానని చెప్పాడు.

అయితే, కొద్దిసేపటికే ఫోన్ కట్ చేసిందని, తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచాప్ వచ్చిందని అతను చెప్పాడు. ఆదివారంనాడు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి తమ వద్ద న్యూడ్ వీడియో ఉందని వేధించడం ప్రారంభించారని, రూ. 50 వేలు ఇస్తే దాన్ని డీలిట్ చేస్తామని చెప్పారని, లేదంటే ఇంటర్నెట్ లో వీడియోలో అప్ లోడ్ చేస్తామని చెప్పారని, చివరకు రూ. 22 వేలకు బేరం కుదిరిందని యువకుడు చెప్పాడు. 

ఆ మొత్తం చెల్లించిన తర్వాత కూడా తనకు మళ్లీ ఫోన్ వచ్చిందని, తిరిగి డబ్బులు అడగడం ప్రారంభించారని చెబుతూ దాంతో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.