ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్  వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇతర టెలికాం సంస్థలు ఎయిర్ టెల్, రిలయన్స్ జియోలు ఇస్తున్న ఆఫర్ల తాకిడిని తట్టుకునేందుకు యత్నిస్తోంది. వాటికి పోటీగా వొడాఫోన్ కూడా  ఆఫర్లు ప్రకటిస్తోంది.

తాజాగా వొడాఫోన్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం ఓ నూతన ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. రెడ్ బేసిక్ ప్యాక్ పేరిట‌ రూ.299 కే అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్‌లో కస్టమర్లకు బిల్ సైకిల్‌లో 20 జీబీ డేటా లభిస్తుంది. దీనికి గాను డేటా రోల్ ఓవర్ సదుపాయాన్ని అందిస్తున్నారు. 

అందువల్ల ఒక నెలలో మిగిలిన డేటా మరుసటి నెల బిల్ సైకిల్‌లో యాడ్ అవుతుంది. దీంతో డేటా వృథా అవుతుందన్న బెంగ ఉండదు. అలాగే ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా లభిస్తున్నాయి. దీంతోపాటు ఈ ప్లాన్‌లో ఏడాది వాలిడిటీ ఉన్న వొడాఫోన్ ప్లే సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నారు.