విమాన టికెట్లపై 75శాతం డిస్కౌంట్

Vistara cuts fares by up to 75% in 24-hour flash sale
Highlights

 ప్రకటించిన విస్తారా ఎయిర్ లైన్స్

ప్రముఖ ఎయిర్ లైన్స్ విస్తారా.. విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తాజాగా భారీ డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటించింది.  ఇందులో భాగంగా 75 శాతం వరకు తగ్గింపు ధరలతో టికెట్లు విక్రయించనున్నట్లు సంస్థ వెల్లడించింది. 

మంగళవారం అర్ధరాత్రి నుం చి 24 గంటలపాటు ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో కొనుగోలు చేసిన టికెట్ల ద్వారా జూన్‌ 21 నుంచి సెప్టెంబర్‌ 27 మధ్యలో ప్రయాణించేందుకు వీలుంటుందని విస్తారా వెల్లడించింది.

 ఈ ఆఫర్‌లో భాగంగా ఢిల్లీ-లఖ్‌నవ్‌ వంటి స్వల్ప దూర మార్గాల టికెట్‌లు కేవలం రూ.1,599కే (అన్నీ కలిపి) లభించనున్నాయి. ఢిల్లీ-హైదరాబాద్‌, ఢిల్లీ-రాంచీ వంటి లాంగ్‌ రూట్‌ టికెట్‌ ధరలను సంస్థ రూ.2,299గా నిర్ణయించింది. 

కోల్‌కతా-పోర్ట్‌బ్లెయిర్‌ టికెట్‌పై రూ. 2,499, ఢిల్లీ నుంచి గోవాకు రూ.2,799 చార్జ్‌ చేయనుంది. విస్తారా ప్రస్తుతం 22 దేశీయ మార్గాల్లో వారానికి 800 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది.

loader