రమణ్ సింగ్‌కు షాక్.. ఛత్తీస్‌గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్

ఛత్తీస్‌గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయి ఎంపికయ్యారు. ఈ మేరకు అనేక తర్జన భర్జనలు, సుదీర్ఘ కసరత్తు అనంతరం ఆయన అభ్యర్ధిత్వాన్ని బీజేపీ పెద్దలు ఖరారు చేశారు. అయితే సీఎం పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు ఈ నిర్ణయం షాకిచ్చినట్లయ్యింది. 

vishnu dev sai will be the new cm of chhattisgarh ksp

ఛత్తీస్‌గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ ఎంపికయ్యారు. ఈ మేరకు అనేక తర్జన భర్జనలు, సుదీర్ఘ కసరత్తు అనంతరం ఆయన అభ్యర్ధిత్వాన్ని బీజేపీ పెద్దలు ఖరారు చేశారు. అయితే సీఎం పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు ఈ నిర్ణయం షాకిచ్చినట్లయ్యింది. నేడు సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా విష్ణుదేవ్ సాయ్‌ను ఎన్నుకున్నారు. 

 

 

నేడు సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా విష్ణుదేవ్ సాయ్‌ను ఎన్నుకున్నారు. తద్వారా దాదాపు ఏడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లయ్యింది. పార్టీ ముగ్గురు పరిశీలకుల సమక్షంలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  

గిరిజన నేతగా వున్న సాయ్‌ని సీఎంగా ఎంపిక చేయడం వెనుక బీజేపీ వ్యూహం వున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా విష్ణుదేవ్ సాయ్ ‌పనిచేశారు. ఆయనకు ఇద్దరు డిప్యూటీ సీఎంలను కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ , మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు కుల సమీకరణాలను అంచనా వేసిన కమలనాథులు ఓబీసీలు, గిరిజనులు, ఆదివాసీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు విష్ణుదేవ్‌ను ఎంపిక చేసి వుంటారని విశ్లేషకులు అంటున్నారు. ఆదివాసీ వర్గానికి చెందిన సాయ్ 1980 నుంచి బీజేపీతో అనుబంధాన్ని కలిగి వున్నారు. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కుంకూరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. సహజంగానే ఛత్తీస్‌గఢ్ దేశంలోనే అత్యధిక ఆదివాసీ జనాభాను కలిగివుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios