రియల్ హీరో: తెలుగు రాష్ట్రాల రైతులకు హీరో విశాల్ చేయూత

Vishal to extend assistance to Telugu states farmers
Highlights

తెలుగు రాష్ట్రాల రైతులకు సాయం చేయడానికి తమిళ హీరో విశాల్ ముందుకు వచ్చాడు.

చెన్నై:  తెలుగు రాష్ట్రాల రైతులకు సాయం చేయడానికి తమిళ హీరో విశాల్ ముందుకు వచ్చాడు. తాజాగా ఆ నిర్ణయాన్ని ప్రకటించడం ద్వారా తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ ఆయన హీరో అనిపించుకున్నారు. ఆయన ఉదారతపై తెలుగు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అభిమన్యుడు సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో తెగిన ప్రతి టికెట్‌పై ఒక్క రూపాయిని  తెలుగు రాష్ట్రాల రైతులకు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. గతంలో విశాలో తమిళనాట కూడా ఇదే విధంగా ప్రకటించి రైతులకు తన వంతు సహాయాన్ని చేస్తున్నారు.

విశాల్ నటుడిగా, నిర్మాతగా, నడిగర్‌ సంఘం కార్యదర్శిగా, సామాజిక కార్యకర్తగా తనదైన ముద్రను వేస్తున్నారు. విశాల్‌ హీరోగా గత వారం విడుదలైన అభిమన్యుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తోంది. 

మొదటి వారాంతాని​కి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12కోట్లు కొల్లగొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. రెండో వారంలో కూడా బాగా ఆడుతోంది. 
 

loader