Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ ల్యాబ్ లోనే తయారైంది.. నితిన్ గడ్కరీ

ఇండియా​ ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కునేందుకు సన్నద్ధంగానే ఉందని అభిప్రాయపడిన గడ్కరీ.. ధైర్యంగా వైరస్​ను ఎదిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Virus Is From A Lab, Not Natural, Says Nitin Gadkari
Author
Hyderabad, First Published May 14, 2020, 7:21 AM IST

కరోనా వైరస్ సహజంగా పుట్టలేదని.. అది ల్యాబ్ లో తయారైందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ దీని ప్రభావం ఎక్కువగానే ఉంది. కాగా... ఈ వైరస్ గురించి తాజాగా నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.

” మనం కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్​ సహజంగా వచ్చినది కాదు. ల్యాబ్​లో తయారుచేసినది. ప్రపంచ దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. . వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం.’ అని నితిన్​ గడ్కరీ వ్యాఖ్యానించారు.

కరోనా విప‌త్క‌ర ప‌రిస్థితులు తీసుకురావ‌డం వ‌ల్ల‌ పరిశ్రమలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడిన అంశంపై స్పందించిన గడ్కరీ… ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అనుకూలతలు క్రియేట్ చెయ్య‌డం సవాలుతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. 

ఇండియా​ ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కునేందుకు సన్నద్ధంగానే ఉందని అభిప్రాయపడిన గడ్కరీ.. ధైర్యంగా వైరస్​ను ఎదిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ చైనాలోని ఓ ల్యాబ్‌ నుంచి బయటకు వచ్చిందని ప్ర‌పంచంలోని చాలా దేశాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. 
అమెరికాతో పాటు బ్రిటన్​, జర్మనీ వంటి దేశాలూ క‌రోనా గురించి చైనాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన దాఖ‌లాలు కూడా ఉన్నాయి. భారత్‌ మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు ఏ విధ‌మైన కామెంట్స్ చెయ్య‌లేదు. అయితే.. తాజాగా కేంద్ర మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios