Coronavirus: పరిస్థితులు వేగంగా మారుతున్నయ్.. కోవిడ్, ఒమిక్రాన్‌పై నిపుణుల హెచ్చరిక !
Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. పలు దేశాల్లో అయితే, ఒమిక్రాన్ విజృంభణ కారణంగా పరిస్థితులు దారుణంగా మారాయి. భారత్ లోనూ కొత్త కేసులు నిత్యం లక్షల్లో నమోదవుతన్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ సైతం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత్ ను కరోనా సునామీ చుట్టుముట్టనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Coronavirus: అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. దీనికి తోడు ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కేసులు సైతం అధికంగా నమోదవుతున్నాయి. దీంతో చాలా దేశాలో కరోనా పంజాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అమెరికా, బ్రిటన్ సహా యూరప్ లోని పలు దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి రికార్డు స్థాయిలో కొనసాగుతున్నది. ఇక భారత్ లోనూ కోవిడ్-19 వ్యాప్తి అధికమవుతున్నది. నిత్యం లక్షల్లోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌ను అతి త్వరలోనే కరోనా సునామీ చుట్టుముట్టేయనుందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
రోజువారీ కరోనా వైరస్ (Coronavirus) కోత్త కేసులు రెండు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో చెరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. అయితే, మున్ముందు పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయని నిపుణులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌ను... ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ ను తేలికగా తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో పాటు.. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణమై.. కోట్లాది మందిని అనారోగ్యానికి.. లక్షల మంది ప్రాణాలు పోవడానికి కారణమైన డెల్టా వేరియంట్ కేసులు సైతం పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం కరోనా వైరస్ (Coronavirus) థర్డ్ వేవ్ అంచున ఉన్నామని పేర్కొంటున్న నిపుణులు.. మున్ముందు కరోనా వైరస్ సునామీల విరుచుకుపడనుందని హెచ్చరిస్తున్నారు. మరో మూడు నాలుగు వారాలు పోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని చెబుతున్నారు.
ఎందుకంటే ప్రస్తుతం కరోనా వైరస్ థర్డ్ వేవ్ అంచన ఉన్న సమయంలో రెండు లక్షలకు పైగా కేసులు నమోదుకావడం వైరస్ వ్యాప్తికి నిదర్శనంగా నిలుస్తున్నది. మున్ముందు తీవ్రత పీక్ స్టేజ్ కు పోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనావైరస్ (Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఎందుకంటే చాలా దేశాల్లో ఇప్పటికే ఒమిక్రాన్ కారణంగా పరిస్థితులు దారుణంగా మారాయి. నిత్యం ఐదు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న దేశాలు పెరుగుతున్నాయి. దీనిని ప్రధాన కారణంగా ఒమిక్రాన్ (Omicron) విజృంభణే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. భారత్ లో కరోనా వైరస్ కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నా.. ఇప్పటికి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది కానీ.. ముందు ముందు కేసులెక్కువైతే ఆస్పత్రుల్లో చేరే వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు.
దేశంలో కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి అధికమవుతున్నది. కోవిడ్-19 రోజురోజుకు పాజిటివిటీ రేట్ పెరిగిపోతుంది. దీనికి తోడు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు.. సంక్రాంతి పండుగ కారణంగా కరోనా ఉధృతి అధికం కానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా సంక్రాంతిని పెద్ద ఎత్తును జరుపుకునే తెలుగు రాష్ట్రాల్లో పట్టణాల నుంచి ప్రజలు పల్లెబాట పట్టారు. దీని కారణంగా వైరస్ వ్యాప్తి అధికం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం నగరాల్లోనే పంజా విసురుతున్న కరోనా (Omicron).. పల్లేలకు సైతం వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. మరో వారం రోజుల్లో… కేసులు రెట్టింపవడం ఖాయంగా కనిపిస్తున్నదని చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉంటూ.. కరోనా బారినపడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.