టీ 20 వరల్డ్ మ్యాచ్ లో టీమిండియా దాయాది జట్టుపై అద్భుత విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్ పై బాలీవుడ్ నటి, విరాట్ సతీమణి అనుష్క శర్మ స్పందించింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
Ind Vs Pak: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. జట్టు విజయంలో రన్ మెషిన్ విరాట్ కోహ్లి చెలరేగిపోయాడు. అతనికి హార్దిక్ పాండ్యా చక్కటి సహకారం అందించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ సాధించిన ఈ విజయంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అదే సమయంలో.. విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్పందించింది. జట్టు విజయంతో దేశ ప్రజలకు ముందుగానే దీపావళి పండుగ వచ్చిందని అభివర్ణించారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ క్రమంలో అనుష్క శర్మ ఇలా రాసుకొచ్చారు.
"చాలా ఆనందంగా ఉంది. దీపావళి రోజున ఉత్కంఠ పోరులో విజయం సాధించి.. క్రికెట్ ప్రేమికుల ఆనందాన్ని మరింత రెట్టింపు చేశారు. మీ ఆట తీరు చాలా అద్భుతంగా ఉంది. మీ పట్టుదల, దృఢసంకల్పం మరియు విశ్వాసం మనసును కదిలించాయి. నేను నా జీవితంలో అత్యుత్తమ మ్యాచ్‌ని ఇప్పుడే చూశానని చెప్పగలను. మన పాప చాలా చిన్నది. ఆమె తల్లి గదిలో ఎందుకు నృత్యం చేస్తుందో .. విపరీతంగా అరుస్తోందో అర్థం కాలేదు.
తన తండ్రి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని తనకి ఏదోక రోజు అర్థమవుతుంది. నిలకడ లేదని నీపై వచ్చిన వార్తలను చెక్ పెడుతూ సాధించిన ఈ విజయం అపూర్వం. నిన్ను చూసి గర్వపడుతున్నాను. ఈ విజయం మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయాలని కోరుకుంటున్నాను. నా ప్రేమ అపరిమితమైనది. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాను." అని అనుష్క శర్మ పోస్ట్ చేశారు.
అనుష్క పోస్ట్ పై విరాట్ కోహ్లీ స్పందన
అనుష్క శర్మ చేసిన ఈ పోస్ట్‌పై విరాట్ కోహ్లీ స్పందించారు. "ప్రతి క్షణం .. ప్రతి క్షణం తోడుగా ఉన్నందుకు నీ ప్రేమకు ధన్యవాదాలు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను." అని పేర్కొన్నారు.
