Republic Day 2022: భార‌త్ లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు (Republic Day 2022) ఘ‌నంగా జ‌రిగాయి. ముఖ్యంగా రాజ్‌ప‌థ్‌ లో కొన‌సాగిన రిప‌బ్లిక్ డే ప‌రేడ్ అక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రపతి బాడీగార్డ్ గుర్రం విరాట్.. రిటైర్ అయ్యింది. గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు చివ‌రిసారి సేవ‌లందించింది. అనంత‌రం బాడీగార్డ్ గుర్రం విరాట్‌కు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని న‌రేంద్ర  మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దానిని నెమరుతూ ఘ‌నంగా వీడ్కోలు పలికారు. 

Republic Day 2022: భార‌త్ లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు (Republic Day 2022) ఘ‌నంగా జ‌రిగాయి. భార‌త్ స్వాతంత్య్రం పొంది 75 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటున్నారు. రాజ్‌ప‌థ్ లో కొన‌సాగిన రిప‌బ్లిక్ డే ప‌రేడ్ అక‌ట్టుకుంది. భార‌తీయ విభిన్న సంస్కృతులు, సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబిస్తూ.. రాష్ట్రాల శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన‌సాగాయి. వివిధ రాష్ట్రాల‌తో పాటు వివిధ కేంద్ర శాఖ‌లు కూడా త‌మ శ‌క‌టాల‌ను ప్ర‌ద‌ర్శించాయి. అత్యంత వైభ‌వంగా రిపబ్లిక్ డే (Republic Day 2022)ప‌రేడ్‌లో శ‌క‌టాల‌ను ప్ర‌ద‌ర్శించారు.

రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ ద‌ళాల అధిప‌తులు, త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రపతి బాడీగార్డ్ గుర్రం విరాట్ (virat,elite horse of President's Bodyguard), ఇవాళ‌ సర్వీస్ నుండి రిటైర్ అయ్యింది. గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు చివ‌రిసారి సేవ‌లందించింది. అనంత‌రం బాడీగార్డ్ గుర్రం విరాట్‌కు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని న‌రేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దానిని నెమరుతూ ఘ‌నంగా వీడ్కోలు పలికారు. గుర్రం విరాట్‌కు ఈ ఏడాది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ మెడల్ ల‌భించిన సంగ‌తి తెలిసిందే. అసాధారణమైన సేవ, సామర్థ్యాల ప్ర‌ద‌ర్శించి.. ప్రశంసలు అందుకున్న మొదటి గుర్రం విరాట్ కావ‌డం విశేషం. ఇది హ‌నోవేరియ‌న్ అనే జాతికి చెందిన గుర్ర‌మ‌ని, 2003 లో రాష్ట్ర‌ప‌తి ర‌క్ష‌ణ విభాగంలో విధుల నిమిత్త‌మై చేరింద‌ని అధికారులు పేర్కొంటున్నారు. 

కాగా, గ‌ణ‌తంత్ర దినోత్సవ వేడుక‌లు దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రిగాయి. అయితే, రాజ్‌ప‌థ్ లో నిర్వ‌హించిన‌ రిప‌బ్లిక్ డే ప‌రేడ్ అక‌ట్టుకుంది. భార‌తీయ విభిన్న సంస్కృతులు, సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబిస్తూ.. రాష్ట్రాల శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన‌సాగాయి. వివిధ రాష్ట్రాల‌తో పాటు వివిధ కేంద్ర శాఖ‌లు కూడా త‌మ శ‌క‌టాల‌ను ప్ర‌ద‌ర్శించాయి. అత్యంత వైభ‌వంగా రిపబ్లిక్ డే (Republic Day 2022)ప‌రేడ్‌లో శ‌క‌టాల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఆధాత్మిక గురువు శ్రీ అరబిందో 150వ జ‌యంతి సంద‌ర్భంగా.. కేంద్ర సాంస్కృతిక శాఖ రాజ్‌ప‌థ్‌పై శ‌క‌టాన్ని ప్ర‌ద‌ర్శించింది. అలాగే, సుభాష్ చంద్ర‌బోస్ స్వ‌తంత్య్ర పోరాటాన్ని ప్ర‌తిబింబించే విధంగా ప్ర‌ద‌ర్శించిన శ‌క‌టం అంద‌రినీ మంత్ర‌ముగ్దుల్ని చేసింది. రిప‌బ్లిక్ డే 2022 ప‌రేడ్ లో ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ 'భారత వైమానిక దళం భవిష్యత్తు కోసం వినూత్నంగా ముందుకు సాగుతూ.. అనేక మార్పులు తీసుకుంటున్న‌ద‌నే' అనే థీమ్‌ను ప్రదర్శిచింది. 

రిప‌బ్లిక్ డే నేప‌థ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ (Republic Day 2022) శుభాకాంక్ష‌లు తెలిపారు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సాధారణంగా జనవరి 24 నుండి ప్రారంభమవుతాయి, అయితే, ఈ సంవత్సరం నుండి అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ (netaji subhas chandra bose) జయంతిని పుర‌ష్క‌రించుకుని జనవరి 23 నుండి గ‌ణ‌తంత్ర వేడుక‌లు (Republic Day) నిర్వ‌హిస్తోంది ప్ర‌భుత్వం.