Asianet News TeluguAsianet News Telugu

డబ్బులు చెట్లకు కాస్తున్నాయి...!: ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో

చెట్ల నుండి డబ్బులు వస్తాయా..  వస్తాయని సోషల్ మీడియాలో ఓ వీడియో చెబుతుంది.  ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.

Viral Video Shows Man Digging Out Coins From A Tree lns
Author
First Published Feb 16, 2024, 1:50 PM IST | Last Updated Feb 16, 2024, 1:50 PM IST

న్యూఢిల్లీ: డబ్బులు చెట్లకు కాస్తాయా... అని  మనం వినే ఉంటాం.  అయితే  నిజంగా ఓ చెట్టు నుండి నాణెలను తీస్తున్నారు. ఈ వీడియో ఒకటి ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

చాలా మంది తమ ఇళ్లలో మనీ ప్లాంట్ ను పెట్టుకోవడానికి ఇష్టపడతారు.  వాస్తు శాస్త్రం ప్రకారంగా  మనీ ప్లాంట్ కలిగి ఉండడం వల్ల ప్రజల ఆర్ధిక అదృష్టాన్ని పెంచుతుంది. అయితే తాజాగా ఓ చెట్టు నుండి నాణెలు తీస్తున్న వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇదే అసలైన మనీ ప్లాంట్ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

అయితే చెట్టు నుండి  నాణెలు రావడం వెనుక  అసలు విషయాలపై ఓ నివేదిక ఇలా చెబుతుంది. స్థానికుల  విశ్వాసం మేరకు  ఈ చెట్టును  పూజిస్తారు.  పూజలు చేసిన సమయంలో  భక్తులు  నాణెలను చెట్టుపైకి విసురుతారు.  వంద ఏళ్లుగా ఈ చెట్టుపై భక్తులు నాణెలు విసురుతున్నారు. ఈ చెట్టుపై నాణెలు విసిరితే  తాము కోరిన కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు. వంద ఏళ్లుగా విసిరిన నాణెలు  చెట్టుపై  అంటుకొని ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

also read:ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌తో పులి: ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన వీడియో


చెట్టు కొమ్మలపై ఇరుక్కున్న నాణెలను  రాయితో కొట్టి  వెలికి తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీహార్ లో డబ్బు చెట్టు పేరుతో  ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

also read:ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

ఈ వీడియోపై ఇంటర్నెట్ లో భిన్న వాదనలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.  చెట్లకు డబ్బులు కాస్తాయనే సామెత గురించి విన్నాను. కానీ ఇది వీడియోలో చూస్తున్నానని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.చివరికి మనీ ప్లాంట్  కనుగొనబడిందని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.  ఈ వీడియో విశ్వసనీయతను మరొక నెటిజన్ ప్రశ్నించారు.  


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios