ఈ వీడియో హిమాచల్ ప్రదేశ్ లోని తిర్తాన్ వ్యాలీలో చోటుచేసుకుంది. అక్కడ చిరుత పులి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా.. అక్కడి ప్రజలు దానితో సరదాగా ఆడుకుంటున్నారు. 

మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే.. సడెన్ గా ఓ చిరుతపులి కనిపించింది అనుకోండి.. ఏం చేస్తారు..? భయంతో పరుగులు తీస్తారు అవునా..? ముందు అక్కడి నుంచి తప్పించుకొని.. ఆ తర్వాత సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తారు. కానీ.. ఓ చోట మాత్రం ఆ చిరుత పులితో ఆటలాడుకుంటున్నారు. ఆ చిరుత పులి కూడా వాళ్లతో అలానే ఆడుకోవడం గమనార్హం. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియో హిమాచల్ ప్రదేశ్ లోని తిర్తాన్ వ్యాలీలో చోటుచేసుకుంది. అక్కడ చిరుత పులి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా.. అక్కడి ప్రజలు దానితో సరదాగా ఆడుకుంటున్నారు.

సరదాగా వాళ్ల మీదకు ఎక్కి పెంపుడు కుక్క ఎలా అయితే.. ఆడుతుందో.. అలా ఆడుతుండటం గమనార్హం. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. చిరుత పులి అలా ఆడుకోవడం చూసి నెటిజన్లు షాకౌతున్నారు. కావాలంటే.. ఈ కింద వీడియోలో మీరు కూడా దానిని చూడొచ్చు. మీరు కూడా ఓ లుక్కేయండి.

Scroll to load tweet…