రామ నామ స్మరణతో మారుమోగుతోన్న దేశం : పాఠశాలలో ప్రజెంట్ సార్‌కు బదులు 'జై శ్రీరామ్'

ఉత్తర గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోని పాఠశాలలో వినూత్న కార్యక్రమం జరిగింది. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోన్న వీడియో ప్రకారం.. స్కూల్ విద్యార్ధులు రోల్ కాల్ సమయంలో 'Yes Sir'కు బదులుగా 'Jai Shri Ram ’ అని చెబుతున్నారు.

Viral Video: 'Jai Shri Ram' replaces 'Yes Sir' roll-call in Gujarat school ahead of Ram Mandir inauguration KSP

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశం మొత్తం రామ నామ స్మరణతో మారుమోగుతోంది. ఎక్కడ చూసినా అయోధ్య గురించే చర్చ జరుగుతోంది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భవ్య రామ మందిరం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తర గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోని పాఠశాలలో వినూత్న కార్యక్రమం జరిగింది. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోన్న వీడియో ప్రకారం.. స్కూల్ విద్యార్ధులు రోల్ కాల్ సమయంలో 'Yes Sir'కు బదులుగా 'Jai Shri Ram ’ అని చెబుతున్నారు. చారిత్రాత్మక ఘటనకు ముందు దేశంలో నెలకొన్న భక్తి గురించి ఇది చెబుతోంది. 

ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వైరల్ అయిన వీడియోలో అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం సమాజంలోని వివిధ వర్గాలపై చూపిన ప్రభావన్ని గమనించవచ్చు. సాధారణ రోల్ కాల్ ప్రతిస్పందనను జై శ్రీరామ్‌తో భర్తీ చేయాలనే నిర్ణయం కేవలం ప్రోటోకాల్‌లో మార్పు మాత్రమే కాదు. దేశ భక్తి , సాంస్కృతిక వైవిధ్యానికి నిదర్శనం. మతపరమైన సరిహద్దులను దాటి దేశంలో ఏకీకృత శక్తిగా ఇది మారింది. లక్షలాది మందితో ప్రతిధ్వనించే భగవంతునితో అనుబంధించబడిన ఆదర్శాలకు ప్రతీకగా జై శ్రీరామ్ నినాదం ఒక ర్యాలీగా మారింది. 

 

 

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న లార్డ్ రామ్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుక సమీపిస్తుండగా.. అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవం విశ్వాసం, రాజకీయాలు , ప్రపంచ ప్రాతినిధ్య అంశాలతో కూడిన మతపరమైన ప్రాముఖ్యతను అధిగమించింది. ఈ చారిత్రాత్మక సందర్భానికి గుర్తుగా విభిన్నమైన ఆహ్వానితుల కలయికతో జనవరి 22న షెడ్యూల్ చేయబడిన ఉత్సవ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. 

ప్రాణ్ ప్రతిష్ట వేడుక కేవలం మతపరమైన కార్యక్రమమే కాదు.. దశాబ్ధాల కృషి, భక్తి, భారతీయ ప్రజల సమిష్టి ఆకాంక్షల పరాకాష్టకు ఇది నిదర్శనం . శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానితుల జాబితాలో 7000 మంది అతిథులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో మందిర్ ఉద్యమానికి అసాధారణమైన కృషి చేసిన రాజకీయ ప్రముఖులు, అంతర్జాతీయ ప్రముఖులు, వ్యక్తులు వుంటారు. రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, రద్దీని నివారించడానికి జనవరి 22న అయోధ్యకు వెళ్లవద్దని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం వుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios