ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఓ ఎంప్లాయ్ తన పైస్థాయిలో ఉన్న వ్యక్తితో వాగ్వాదానికి దిగినట్టుగా కనిపిస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఓ ఎంప్లాయ్ తన పైస్థాయిలో ఉన్న వ్యక్తితో వాగ్వాదానికి దిగినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇది దేశంలోనే అతిపెద్ద ఎడ్యుటెక్ స్టార్టప్ కంపెనీ అయిన బైజూస్ సంస్థ కార్యాలయంలో చోటుచేసుకున్నదిగా చెప్పబడుతుంది. ఈ వీడియో ట్విట్టర్ హ్యాండిల్‌లో ‘ఘర్ కే కలేష్’ అనే యూజర్ అప్‌లోడ్ చేశారు. అయితే ఈ వీడియో ప్రామాణికతను ఏషియానెట్ న్యూస్ ధ్రువీకరించలేదు. ఆ వీడియోలో పేర్కొన్న ప్రకారం.. ఇన్సెంటివ్ కోసం ఓ మహిళా ఉద్యోగి తన సీనియర్‌తో గొడవ పడుతోంది. తనకు ఎలాంటి మద్దతు లభించడం లేదని కూడా చెబుతోంది.
అయితే గతకొంతకాలంగా బైజూస్‌లో పరిస్థితులు అంతా బాగోలేవనే నివేదికలు ఉన్నాయి. ఇటీవల పలువురు బోర్డు సభ్యులు, ఆడిటర్లు రాజీనామా చేశారు. 2021 ఆర్థిక సంవత్సరంలో బైజాస్ కంపెనీ భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ సమయంలో కంపెనీ కొంతమంది ఉద్యోగులను కూడా తొలగించింది. ఇక, ఈ వీడియోను పోస్టు చేసిన వ్యక్తి.. బైజూస్ ఆఫీస్‌లో జరిగిందని పేర్కొన్నారు. బైజూస్‌లో ఉద్యోగులు భారీగా వేధింపులు ఎదుర్కొంటున్నారని కూడా ఆరోపించారు. అయితే ఈ సంఘటన తర్వాత యువతి కనిపించకుండా పోయిందని కూడా పేర్కొన్నారు.
‘
‘‘అవును సార్, నాకు పిచ్చి పట్టడం వల్ల నేను అరుస్తున్నాను’’ అని ఆ మహిళ చెప్పినట్లు వినవచ్చు. 12 నెలలుగా మాకు ఇన్సెంటివ్ అందడం లేదని మహిళా ఉద్యోగి వీడియోలో చెబుతున్నారు. ఆమె తొలగింపుల గురించి ఫిర్యాదు చేయడంతో పాటు ఎఫ్‌ఎన్‌ఎఫ్‌లో కేవలం రూ. 2,000 అందిస్తున్నారని కూడా ఆరోపించింది. వర్క్ కల్చర్‌పై కూడా ఆమె విమర్శల చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు బైజూస్ మాజీ ఉద్యోగులు ఆ యువతి నిజమేనని కామెంట్స్ చేస్తున్నారు.
