మహిళలు, చిన్నారుల రక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ యాక్ట్ వంటి చట్టాన్ని తీసుకొచ్చింది. ఇదే దారిలో మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.

దేశ ప్రజలు దిశ ఘటన మరచిపోకముందే అదే తరహా ఘటన ఒడిషాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నవరంగపూర్ జిల్లాలోని కొశాగుమడ సమితిలోని గమండల గ్రామంలో ఓ బాలికపై కొందరు దుండగులు సామూహితక అత్యాచారానికి పాల్పడి, అనంతరం దారుణంగా హత్య చేశారు.

Also Read సమత గ్యాంగ్ రేప్, హత్య: 44 మంది సాక్షుల విచారణ, ఛార్జీషీట్ ఇదీ...

శుక్రవారం రాత్రి గ్రామంలో దియాలి పర్వదినం చేసుకుని బాధితురాలు ఇంటికి చేరుకునింది. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో బహిర్భూమి కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే ఎంతసేపటికి ఆమె తిరిగి రాకపోవడంతో బాలిక కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు.

గ్రామస్తులు, బంధువుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ బాలిక ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో శనివారం గ్రామానికి చెందిన కొందరు మహిళలు బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని గ్రామస్తులు, బాలిక కుటుంబసభ్యులకు తెలియజేయగా వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు.

అక్కడ బాధితురాలి మృతదేహంతో పాటు రెండు పురుషుల జీన్స్ ప్యాంటులు, చెప్పులు పడివుండటంతో పాటు బాలిక శరీరంపై రక్కిన గాయాలను చూశారు. దీంతో వారు బాలిక అత్యాచారానికి గురైందని నిర్థారించారు. వెంటనే బాలిక కుటుంబసభ్యులు కొశాగుమడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read:నా బిడ్డని చంపిందెవరో రోజాకి తెలుసు.. ఆయేషా మీరా తల్లి సంచలన కామెంట్స్

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా బాలికై అత్యాచారం, హత్య ఘటనపై నవరంగ‌పూర్ జిల్లా మాఘొరొ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు కాదంబనీ త్రిపాఠి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణంపై విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను డిమాండ్ చేశారు.