Asianet News TeluguAsianet News Telugu

నేర చరిత్ర చాలా పెద్దదే: ఎవరీ గ్యాంగస్టర్ వికాస్ దూబే?

యూపీలోని కాన్పూర్ ప్రాంతంలో ఎనిమిది మంది పోలీసులను బలి తీసుకున్న వికాస్ దూబే నేర చరిత్ర చాలా పెద్దదే. పోలీసు స్టేషన్ లోకి దౌర్జన్యంగా చొరబడి అప్పట్లో రాష్ట్ర మంత్రిని చంపిన చరిత్ర కూడా అతనికి ఉందని అంటారు.

Vikas Dubey: Noted Kanpur gangster, ex-District Panchayat member and wanted in over 60 cases
Author
Kanpur, First Published Jul 3, 2020, 8:47 AM IST

కాన్పూర్: గ్యాంగస్టర్ వికాస్ దూబేను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసుల్లో ఎనిమిది బలయ్యారు. వికాస్ దూబే ముఠా జరిపిన కాల్పుల్లో డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ స్థాయి ఉన్నతాధికారితో పాటు ఎనిమిది మరణించారు. గురువారం అర్థరాత్రి జరిగిన సంఘటనలో వారు మృతి చెందారు. 

వికాస్ దూబే కోసం మూడు పోలీసు స్టేషన్లకు చెందిన బృందాలు చౌబేపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దిక్రు గ్రామానికి వెళ్లాయి. వికాస్ దూబేపై 60 కేసులు ఉన్నాయి. తాజా హత్య కేసులో వికాస్ దూబే ఇంటిపై దాడి చేయడానికి పోలీసులు వెళ్లారు. 

Also Read: రౌడీ షీటర్ వికాస్ దూబే గ్యాంగ్ కాల్పులు: ఎనిమిది మంది పోలీసులు బలి

వికాస్ దూబే నేరచరిత్ర చాలా పెద్దదే. 2001లో జరిగిన బిజెపి నేత, రాష్ట్ర మంత్రి సంతోష్ శుక్లా హత్య ఘటనలో వికాస్ దూబే పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆ కేసు నుంచి అతను విముక్తి పొందాడు. 

కాన్పూర్ లోని శివాలీ పోలీస్ స్టేషన్ పరిధఇలో తారాచంద్ ఇంటర్ కాలేజీ అసిస్టెంట్ మేనేజర్ సిద్ధేశ్వర్ పాండే హత్య కేసులో కూడా అతని పేరు ఉంది. ఈ హత్య 2000లో జరిగింది. 2004లో జరిగిన కేబుల్ వ్యాపారి దినేష్ దూబే హత్య కేసులో అతను నిందితుడు. 

2018లో అతను తన కజిన్ అనురాగ్ పై దాడి చేశాడు. మతి జైలులోనే అతనిపై దాడికి దూబే హత్యకు పథకరచన చేశాడు. ఈ కేసులో వికాస్ దూబేతో పాటు నలుగురిపై అనురాగ్ భార్య ఫిర్యాదు చేసింది. 

జైలులో ఉండగానే అతను శివరాజ్ పూర్ నగర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు. బాల్యంలోనే తన నేరచరిత్రకు శ్రీకారం చుట్టాడు. ఓ ముఠాను తయారు చేసుకుని లూటీలు, దాడులు, హత్యలు చేస్తూ వచ్చాడు. 19 ఏళ్ల క్రితం అతను పోలీసు స్టేషన్ లోకి దౌర్జన్యంగా ప్రవేశించి రాష్ట్ర మంత్రిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios