హోదా విషయంలో ఆ మూడు పార్టీలు ముద్దాయిలే.. హోదా సంజీవినే: విజయసాయి

First Published 24, Jul 2018, 4:50 PM IST
vijayasai reddy comments on AP Special Status in Rajyasabha
Highlights

రాజ్యసభలో విభజన చట్టం అమలు, ప్రత్యేకహోదాపై చర్చ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడారు. 

రాజ్యసభలో విభజన చట్టం అమలు, ప్రత్యేకహోదాపై చర్చ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం దారుణమన్నారు. హోదా  ఏమీ సంజీవని కాదని టీడీపీ చెప్పింది. కానీ వైసీపీ, వామపక్షాలు, జనసేనన పార్టీలు ఏపీకి ప్రత్యేకహోదా సంజీవనే అని నమ్ముతున్నాయి.. తమ పార్టీ నాలుగేళ్లుగా హోదా కోసం పోరాడుతోందన్నారు.

ఇప్పటి వరకు ప్రత్యేకహోదా రాకపోవడంలో బీజేపీ మొదటి ముద్దాయని.. టీడీపీ రెండవ ముద్దాయని.. కాంగ్రెస్ మూడవ ముద్దాయని విజయసాయి ఆరోపించారు. హోదా  ఇస్తామని గత ప్రభుత్వం తీర్మానం చేసింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని తర్వాతి ప్రభుత్వాలు గౌరవించాలని విజయసాయి సూచించారు.. 14 వ ఆర్థిక సంఘం పేరు చెప్పి బీజేపీ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం సరైనది కాదని అన్నారు... 

loader