అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాతీలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌పై భగ్గుమన్నారు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్.

అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాతీలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌పై భగ్గుమన్నారు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్.

గుజరాతీల పట్ల ఆయన వ్యాఖ్యలు ఆయన మనస్తత్వాన్ని, గుజరాత్ పట్ల ద్వేషాన్ని చూపుతాయని ఎద్దేవా చేశారు. అలాగే గుజరాత్‌ను కాంగ్రెస్ పార్టీ అవమానించడం ఇదే మొదటిసారి కాదని.. రాబోయే రోజుల్లో, రాబోయే ఎన్నికలలో గుజరాతీయులు కాంగ్రెస్‌ను కలిసికట్టుగా ఓడిస్తారని పాటిల్ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

మరోవైపు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా రాహుల్‌కు ఘాటుగా బదులిచ్చారు. ఆయన మాటలు గుజరాత్‌పై కాంగ్రెస్ పార్టీకున్న ద్వేషాన్ని వెల్లడించాయని తెలిపారు. కానీ గుజరాత్ అటువంటి నీచమైన ద్వేషాన్ని అంగీకరించదని, ప్రతీ గుజరాతీయుడు కాంగ్రెస్ పార్టీకి తగిన సమాధానం ఇస్తారని రూపానీ ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

అసోంలోని శివసాగర్‌లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అసోం విభజనకు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. అసోం ఒప్పందంలోని ప్రతి అంశాన్ని పరిరక్షించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని రాహుల్ స్పష్టం చేశవారు.

రాష్ట్రానికి 'సొంత ముఖ్యమంత్రి' అవసరమని, అతను ప్రజల వాణి వినగలిగే వాడై ఉండాలే కానీ, నాగపూర్, ఢిల్లీ చెప్పినట్టు నడుచుకునే వాడు కాకూడదని విమర్శించారు. అదే సమయంలో అసోంలోని టీ గార్డెన్‌ కార్మికులకు రోజుకు రూ. 167 ఇచ్చి గుజరాత్‌లోని వ్యాపారులు టీ. గార్డెన్స్ పొందుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అసోంలోని టీ కార్మికులకు రోజుకు రూ.365 ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.