Asianet News TeluguAsianet News Telugu

కరోనా రోగులపై నిర్దయ: ఒకే గుంతలో 8 మృతదేహాలు విసిరి, చేతులు దులుపుకెళ్లారు

వైరస్‌తో మరణించిన వారి మృతదేహాలను మూటకట్టి ఒకదానిమీద ఒకటి వేసి అత్యంత దారుణంగా ఒకే గుంతలోకి విసిరేసి అంత్యక్రియలు పూర్తి చేశారు

video of covid 19 patients funeral in ballari
Author
Ballari, First Published Jun 30, 2020, 7:34 PM IST

కరోనా వైరస్‌తో మరణించిన వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలని, వారి అంత్యక్రియలు సాంప్రదాయబద్ధంగా జరగాలని న్యాయస్థానాలు ఎంతగా చెబుతున్నా అధికారులు, వైద్య సిబ్బంది వీటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో వైరస్‌తో మరణించిన వారి మృతదేహాలను మూటకట్టి ఒకదానిమీద ఒకటి వేసి అత్యంత దారుణంగా ఒకే గుంతలోకి విసిరేసి అంత్యక్రియలు పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలో సోమవారం కరోనా కారణంగా 8 మంది మరణించారు.

అంతకుముందే కోవిడ్ 19తో చనిపోయిన వారికి నగర శివార్లలో ఒకే చోట అంత్యక్రియలు  నిర్వహించడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో సోమవారం మరణించిన వారి మృతదేహాలను ప్రత్యేక వాహనంలో ఊరి చివరకు తీసుకెళ్లారు.

Also Read:మనుషులపై సక్సెస్... మందు మాత్రం కాదు: ‘ కరోనిల్‌ ’‌పై పతంజలి యూటర్న్

అంత్యక్రియలు నిర్వహించడానికి వేర్వేరు గుంతలు తియ్యకుండా ఒకే గుంత తీసి అందులో మృతదేహాలను ఒకదాని మీద ఒకటి విసిరేశారు. ఈ సమయంలో ఓ వ్యక్తి దీనిని వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెట్టాడు.

మృతదేహాలను ఒకదాని మీద ఒకటి వేసి విసిరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios