Asianet News TeluguAsianet News Telugu

మనుషులపై సక్సెస్... మందు మాత్రం కాదు: ‘ కరోనిల్‌ ’‌పై పతంజలి యూటర్న్

ప్రపంచవ్యాప్తంగా మానవాళికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ ఇంత వరకు ఫలితం మాత్రం శూన్యం. ఈ నేపథ్యంలో పతంజలి సంస్థ నిర్వహకులు కరోనా ముందు పేరిట చేసిన ప్రకటన నుంచి యూటర్న్ తీసుకున్నారు

Patanjali takes u-turn on coronavirus medicine claims, says no such medicine made
Author
New Delhi, First Published Jun 30, 2020, 6:36 PM IST

ప్రపంచవ్యాప్తంగా మానవాళికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ ఇంత వరకు ఫలితం మాత్రం శూన్యం.

ఈ నేపథ్యంలో పతంజలి సంస్థ నిర్వహకులు కరోనా ముందు పేరిట చేసిన ప్రకటన నుంచి యూటర్న్ తీసుకున్నారు. తాము కోవిడ్ 19 నివారణకు ఎలాంటి మెడిసిన్ తయారు చేయలేదంటూ మాట మార్చారు.

కరోనా కిట్ పేరిట తాము ఎలాంటి అమ్మకాలు చేపట్టలేదని మంగళవారం వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. కరోనాను కట్టడి చేసేందుకు కరోలిన్ అనే మందును కనిపెట్టినట్లు పతంజలి సంస్థ గత మంగళవారం ప్రకటించింది.

Also Read:కరోనాకు మందు.. పతంజలికి కేంద్రం షాక్, ఆ తర్వాతే మార్కెట్‌లోకి..!!!

యోగా గురువు రాందేవ్ బాబా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్న పతంజలి ప్రధాన కేంద్రంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా కరోనా లక్షణాలు కలిగివున్న వంద మంది రోగులపై ఈ మందును ప్రయోగించగా... వారిలో దాదాపు 65 మంది పూర్తిగా కోలుకున్నారని రాందేవ్ పేర్కొన్నారు.

ఈ క్రమంలో పతంజలి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ... ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని రాందేవ్ బాబు, పతంజలి ఛైర్మన్ బాలకృష్ణపై పలువురు మండిపడ్డారు.

సరిగ్గా ఇదే సమయంలో కరోనిల్ ప్రకటనలను భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అటు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సైతం... కరోనా నిరోధక మందుల తయారీకి పతంజలి కంపెనీ ఎలాంటి లైసెన్స్‌లు తీసుకోలేదని, కేవలం దగ్గు నివారణ మందుగానే భావించే తాము అనుమతించామని పేర్కొంది.

ఈ క్రమంలో కరోలిన్ మందుపై వివరణ ఇవ్వాల్సిందిగా.. ఉత్తరాఖండ్ డ్రగ్ డిపార్ట్‌మెంట్ పతంజలి సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై సదరు కంపెనీ స్పందించింది.

కరోనా కిట్ పేరును ఎక్కడా వాడటం లేదు. మందును తయారు చేయలేదు.. దివ్య స్వసారి, దివ్య కరోనిల్ టాబ్లెట్, దివ్య అను టేల్ అనే మెడిసిన్‌తో కూడిన ప్యాకేజీ మాత్రమే షిప్పింగ్ చేస్తున్నామన్నారు.

Also Read:కరోనాకి మందు కనిపెట్టిన బాబా రాందేవ్

కరోనిల్ కిట్ అనే కిట్‌ను విక్రయించడం లేదని స్పష్టం చేసింది. తాము కేవలం ఈ మందులకు సంబంధించిన ప్రయోగం విజయవంతమైన విషయాన్ని మాత్రమే మీడియా ముందు తెలిపామని పేర్కొంది.

మనుషులపై ప్రయోగించినప్పుడు సత్ఫలలితాలు ఇచ్చిందనే చెప్పామే తప్ప.. ఇది కరోనాను నయం చేస్తుందని ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదని తెలిపింది. అయితే అది దగ్గు మందా లేదా మరే ఇతర ఔషధమా అన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios