షూలో దూరిన త్రాచుపాము.. వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది..!
ఓ మహిళ ఇంటి ముందు షూ వదిలి ఇంట్లోకి వెళ్లింది. ఆ తర్వాత, మరుసటి రోజు బయటకు వెళదామని షూ వేసుకోవడానికి చూసినప్పుడు, అందులో పాము షూసి షాకైంది.
ఎవరైనా చెప్పులు, షూలు ఇంట్లో పెట్టుకోరు. ఇంటి ముందు, బయట మాత్రమే పెట్టుకుంటారు. అయితే, అలా బయట పెట్టుకున్నప్పుడు మీరు వేసుకునే షూలో పాము దూరి కనిపిస్తే, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది..? ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది కదా. కానీ, ఓ మహిళకు మాత్రం అలాంటి సంఘటన నిజంగా ఎదురైంది. షూ వేసుకుందామని చూసేలోపు దానిలో నుంచి తాచు పాము కనిపించింది. పడక విప్పి, బుసలు కొడుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ, ప్రస్తుతం సోషల్ మీ డియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే,.. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్ వేదికగా ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో ఓ మహిళ ఇంటి ముందు షూ వదిలి ఇంట్లోకి వెళ్లింది. ఆ తర్వాత, మరుసటి రోజు బయటకు వెళదామని షూ వేసుకోవడానికి చూసినప్పుడు, అందులో పాము షూసి షాకైంది. ఎప్పుడు వచ్చి దూరిందో పాము తెలీదు కానీ, ఆమె వేసుకునే సమయానికి పడగ విప్పి, బుసలు కొడుతుండటం విశేషం.
ముందు భయపడినా, తర్వాత దానిని వీడియో తీయడం విశేషం. అయితే, ఆ పాము తర్వాత అందులో నుంచి బయటకు వెళ్లిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన తర్వాత, మీరు కూడా ఇంటి బయట విప్పిన షూస్ ని చూసుకోకుండా వేసుకోకండి. పాము కాబట్టి కనపడింది. తేలు లాంటివి కూడా షూస్ లో దూరతాయి. అవి తొందరగా కనిపించవు. కాబట్టి, చూసుకొని వేసుకోకుంటే, వాటి కాటుకు మనం బలైపోవడం ఖాయం.