మణిపూర్ లో రక్తసిక్తమైన వ్యక్తిని దహనం చేసిన వీడియో వైరల్... అధికారులేమంటున్నారంటే...

మణిపూర్ లో కుకీ తెగకు చెందిన ఓ వ్యక్తిని కందకంలో దహనం చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని అధికారులు అంటున్నారు. 

video of a man burning in Manipur has gone viral - bsb

మణిపూర్‌ : మణిపూర్‌ చిచ్చు ఇంకా ఆరలేదు. అక్కడ చెలరేగిన హింసకు సంబంధించిన వార్తలు మళ్లీ మళ్లీ గుప్పుమంటూనే ఉన్నాయి. తాజాగా మణిపూర్ కు చెందిన వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి మృతదేహాన్ని కందకంలో కాల్చివేసినట్లు కనిపించింది. వాట్సాప్‌లో ఈ వీడియో విపరీతంగా షేర్ అయ్యింది. 

ఈ వీడియో కేవలం 7 సెకన్లు మాత్రమే ఉంది. ఈ వీడియోలో చూసినట్లుగా బాధితుడి ముఖం మొత్తం రక్తసిక్తమై ఉంది. ముఖంపై "కుకి" అని రాసి ఉంది.వీడియో వైరల్ కావడంతో, అధికారులు ఆ వ్యక్తిని గుర్తించగలిగారు. అయితే, అతడిని దహనం చేసిన సమయంలో అప్పటికే మరణించాడా? లేదా సజీవంగా ఉన్నాడా? అనేది స్పష్టంగా తెలియలేదు.

విదేశాల్లో పెట్టుబడులతో అధికరాబడులంటూ.. నాగ్‌పూర్ వ్యాపారిని రూ. 5.39 కోట్లు మోసం చేసిన ముఠా...

మణిపూర్‌లో హింస చెలరేగిన మరుసటి రోజు మే 4న జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఇది అని మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ తెలిపారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తనకు తెలియదని, అయితే ఆ వ్యక్తిని అధికారులు గుర్తించారని, అతను కాంగ్‌పోక్పి జిల్లాలో నివసిస్తున్నాడని చెప్పాడు.

"నిన్న, ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోను ధృవీకరించాం. ఇది మే 4 న జరిగిందని తెలుస్తోంది. మృతదేహాన్ని గుర్తించాం. సదరు వ్యక్తి మృతదేహం ఆసుపత్రిలో ఉంది" అని కుల్దీప్ చెప్పారు. మణిపూర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజీవ్ సింగ్ అభ్యర్థన మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు కోసం కేసును చేపట్టిందని కుల్దీప్ తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios