Asianet News TeluguAsianet News Telugu

మహిళతో అభ్యంతరకరంగా రాజస్థాన్ మంత్రి వీడియో కాల్.. సోషల్ మీడియాలో వైరల్.. రాజీనామాకు బీజేపీ డిమాండ్

రాజస్థాన్ మంత్రి సలేహ్ మహ్మద్‌ కు సంబంధించిన అభ్యంతరకరమైన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మంత్రిని బర్త్ రఫ్ చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేసింది. 

Video call of Rajasthan minister with woman wearing inner wears.. Viral on social media.. BJP demands resignation
Author
First Published Dec 8, 2022, 11:04 AM IST

రాజస్థాన్‌ మంత్రికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో రాజస్థాన్ మైనారిటీ వ్యవహారాల మంత్రి సలేహ్ మహ్మద్‌ తో ఓ మహిళ వీడియో కాల్ మాట్లాడుతోంది. అందులో ఆమె ఇన్నర్ వేర్స్ తో ఉంది. అయితే దీనిపై బీజేపీ మండిపడింది. ఆ మంత్రిని తొలగించాలని డిమాండ్ చేసింది.

కవల సోదరుల్ని వివాహం చేసుకున్న కవల సోదరీమణులు... పశ్చిమ బెంగాల్ లో అరుదైన పెళ్లి...

లీకైన ఈ వీడియోలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ వినబడటం లేదు. అతడితో వీడియో కాల్ మాట్లాడిన మహిళ జోధ్‌పూర్‌కి చెందినదని బీజేపీ పేర్కొంది. దీనిని ఆ పార్టీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.  కాంగ్రెస్ నుంచి సలేహ్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. “అశోక్ గెహ్లాట్ జీ, మీ మంత్రి ఒక మహిళతో అభ్యంతరకరమైన వీడియో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. ఓటు బ్యాంకుపై దురాశతో మంత్రి సలేహ్ మహ్మద్‌ను తొలగిస్తారా లేదా తప్పించుకుంటారా’’అని రాజస్థాన్ బీజేపీ ట్వీట్ చేసింది.

హిమాచల్‌ ఫలితంపై ఉత్కంఠ.. ఎమ్మెల్యేలను తరలించే యోచనలో కాంగ్రెస్.. రంగంలోకి ప్రియాంక..!

కాగా.. రెండు రోజుల క్రితం లీకైన ఈ వీడియోపై జోధ్‌పూర్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాను మంత్రితో మాట్లాడుతుండగా పొరపాటున వీడియో తీశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే  7 ఏళ్ల బాలిక ఫోన్‌లో గేమ్ ఆడుతూ వేరే వారికి ఫార్వార్డ్ చేసిందని పేర్కొంది. అయితే రెండు నెలల క్రితం తన బంధువుల వద్దకు వెళ్లినప్పుడు వీడియోను వైరల్ చేస్తానని నిందితులు బెదిరించాడని మహిళ చెప్పింది. రూ. 25 లక్షలు ఇవ్వాలని, రిలేషన్ షిప్ చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. దీంతో తాను ఆత్మహత్య చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాని తెలిపారు.

అయితే మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు పోకరన్‌కు చెందిన పంకజ్ విష్ణోయ్, వికాస్, రాంజాస్ విష్ణోయ్, సుమిత్ విష్ణోయ్, రవీంద్ర విష్ణోయ్‌లను అరెస్ట్ చేశారు. కాగా.. ఈ వీడియోపై మంత్రి స్పందించలేదు. దీనిపై బీజేపీ నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ఇన్‌చార్జ్ అమిత్ మాల్వియా స్పందించారు.  “ సలేహ్ మొహమ్మద్ ముస్లిం కమ్యూనిటీ మత గురువు, మాజీ క్యాబినెట్ మంత్రి ఘాజీ ఫకీర్ కుమారుడు. ఆయన వల్లే సలేహ్ ను మంత్రిని చేశారు. ఈ కుటుంబానికి (కాంగ్రెస్ నాయకురాలు) సోనియా గాంధీతో పరిచయం ఉంది. అశోక్ గెహ్లాట్ ఏమీ చేయలేరని నేను అనుకుంటున్నాను ’’ అని ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios