Asianet News TeluguAsianet News Telugu

హిమాచల్‌ ఫలితంపై ఉత్కంఠ.. ఎమ్మెల్యేలను తరలించే యోచనలో కాంగ్రెస్.. రంగంలోకి ప్రియాంక..!

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరా హోరీ  పోరు సాగుతుంది. మొత్తం 68 స్థానాలకు గానూ.. రెండు పార్టీలు కూడా 30పై స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

Congress plans to shift Himachal MLAs to Rajasthan Sources
Author
First Published Dec 8, 2022, 10:32 AM IST

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరా హోరీ  పోరు సాగుతుంది. మొత్తం 68 స్థానాలకు గానూ.. రెండు పార్టీలు కూడా 30పై స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అయితే చివరి వరకు ఇదే రకమైన ఉత్కంఠ కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హిమాచల్‌లో అధికారం సాధించాలంటే.. 35 స్థానాల మెజారిటీ మార్క్‌ను అధిగమించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకవేళ ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో ఇండిపెండెంట్లు కీలక భూమిక అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక పార్టీ.. మరోక పార్టీ‌లో గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే అవకాశాలు లేకపోలేదు. 

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను రాజస్తాన్‌కు తరలించాలని  ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ బాధ్యతలను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, సీనియర్ నాయకుడు భూపిందర్ సింగ్ హుడాకు అప్పగించినట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ లోటస్‌‌కు అవకాశం ఇవ్వకుండా ఈ జాగ్రత్తలు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికలు రచిస్తున్నట్టుగా ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఎమ్మెల్యేలను బస్సుల్లో రాజస్థాన్‌కు తరలించే అవకాశం ఉందని తెలిపాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని.. ఈరోజు ఆమె సిమ్లా చేరుకుంటారని సమాచారం. ఇప్పటికే భూపేష్ బఘేల్, భూపిందర్ సింగ్ హుడా‌లు.. ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు టచ్‌లో ఉంటూ వస్తున్నారు. 

మరోవైపు హిమాచల్‌లో పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెట్లతో ఆ పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ప్రచారం సాగుతుంది. 

. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో గత 30 ఏళ్లుగా ఒకసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్.. ఇలా ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఎన్నికవుతూ వస్తున్నాయి. అయితే ఈసారి ఆ ట్రెండ్‌ను తిప్పికొట్టి.. వరుసగా రెండో సారి హిమాచల్‌లో విజయం సాధించాలని బీజేపీ పట్టుదలతో ప్రచారం చేసింది. మరోవైపు కాంగ్రెస్ ‌కూడా తన మనుగడ కోసం తీవ్రంగానే శ్రమించింది. చాలాకాలంగా హిమాచల్‌లో ఐదేళ్లకొకసారి అధికార మార్పిడి జరుగుతుందని.. ఈసారి కూడా అదే జరుగుతుందని, తమ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios