ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ బెంగళూరులోని ఇస్రో ఐసైట్ సందర్శించనున్నారు. ఈ కారణంగా బెంగళూరు నగరంలో ట్రాఫిక్ పోలీసులు కొన్ని కీలక సూచనలు చేశారు. పలు రోడ్లపై ప్రయాణికులు రావొద్దని స్పష్టం చేశారు. మరికొన్ని చోట్లా వాహనాల పార్కింగ్ నిషేదించారు. 

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ బెంగళూరు పర్యటిస్తున్నారు. ఇస్రోకు చెందిన శాటిలైట్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్(ఐఎస్ఐటీఈ) సందర్శిస్తున్నారు. వీవీఐపీ పర్యటన నేపథ్యంలో మార్చి 8వ తేదీన బెంగళూరు సిటీలో ట్రాఫిక్ ప్రత్యేక నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. వీవీఐపీ పర్యటన అలాగే.. మెరుగైన ప్రజా రవాణా కోసం బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కొన్ని మార్పులు చేశారు.

ప్రయాణికులకు ఈ దారులు నిషేధం

- వర్థుర్ రోడ్డు (సురంజన్‌దాస్ రోడ్ జంక్షన్ నుంచి మరతనహల్లి బ్రిడ్జీ వరకు)
- ఔటర్ రింగ్ రోడ్డు (కార్తిక్ నగర్ జంక్షన్ నుంచి మరతనహల్లి బ్రిడ్జీ వరకు)
- దొద్నక్కుండి మెయిన్ రోడ్డు (వర్థుర్ రోడ్డు నుంచి దొద్నకుండి ఇస్రో వరకు)
- బవసనగర్ మెయిన్ రోడ్డు
- సురంజన్‌దాస్ రోడ్డు
- ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డు

అలాగే.. ఈ ప్రాంతాల్లో అన్ని రకాల వాహనాల పార్కింగ్ నిషేధం

- వర్థుర్ రోడ్డు (మరతనహల్లి బ్రిడ్జీ వరకు రోడ్డుకు ఇరువైపుల ఎక్కడా పార్కింగ్ చేయరాదు)
- హోరావర్తుల రోడ్డు (కార్తిక్ నగర్ జంక్షన్‌లోని మరతనహల్లి బ్రిడ్జీ వరకు రోడ్డుకు ఇరువైపులా)
- దొద్నక్కుండి మెయిన్ రోడ్డు (వర్థుర్ రోడ్డు నుంచి దొద్నక్కుండి ఇస్రో వరకు రోడ్డుకు ఇరువైపులా ఏ వాహానాన్నీ పార్కింగ్ చేయరాదు)