Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బాసుదేవ్ ఆచార్య కన్నుమూత


సీపీఎం కీలక నేత  బాసుదేవ్ ఆచార్య  అనారోగ్యంతో కన్నుమూశారు.  కొంత కాలంగా హైద్రాబాద్ లో ఆయన చికిత్స పొందుతున్నారు.  ఇవాళ ఆయన మరణించారు.  9 దఫాలు బంకూరా నుండి  ఆయన ఎంపీగా విజయం సాధించారు.

Veteran CPI(M) leader Basudeb Acharia dies in Hyderabad at 82 lns
Author
First Published Nov 13, 2023, 7:43 PM IST

హైదరాబాద్: సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సీపీఎం నేత బాసుదేవ్ ఆచార్య సోమవారంనాడు  హైద్రాబాద్ లో  కన్నుమూశారు.  అస్వస్థతకు గురైన బాసుదేవ్ ఆచార్య హైద్రాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.బాసుదేవ్ ఆచార్య వయస్సు 82 ఏళ్లు.  వృద్ధాప్యం కారణంగా  వచ్చిన సమస్యలతో  ఆయన  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  కొంతకాలంగా ఆయన  హైద్రాబాద్ లో కొడుకుతో కలిసి ఉంటున్నాడు.  
1942 జూలై  11న పురులియాలో  బాసుదేవ్ ఆచార్య  జన్మించారు. విద్యార్ధి దశ నుండే ఆయన రాజకీయాల్లోకి వచ్చాారు.  గ్రామీణ గిరిజన సంఘం ఉద్యమం, ప్రచారంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

సీపీఎం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎండీ సలీమ్  బాసుదేవ్ ఆచార్య మృతిపై  సంతాపం తెలిపాు.  ప్రముఖ పార్లమెంటేరియన్, ట్రేడ్ యూనియన్ నాయకుడిగా  సలీమ్ పేర్కొన్నారు.  ఇవాళ మధ్యాహ్నం హైద్రాబాద్ బాసుదేవ్ ఆచార్య మృతి చెందారని  సలీం ప్రకటించారు.

అనుభవం ఉన్న నేత, లెఫ్ట్ నాయకుడు  బాసుదేవ్ ఆచార్య మృతిపై  బెంగాల్ సీఎం మమత బెనర్జీ  విచారం వ్యక్తం చేశారు.  బాసుదేవ్ ఆచార్య మృతి  పేదలకు తీవ్ర నష్టాన్ని కల్గిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.  బాసుదేవ్ ఆచార్య  కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులకు  సానుభూతిని తెలిపారు మమత బెనర్జీ.సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా  బాసుదేవ్ ఆచార్య ఉన్నారు.  బంకురా పార్లమెంట్ స్థానం నుండి  బాసుదేవ్ ఆచార్య  1980 నుండి 2014 వరకు  తొమ్మిది దఫాలు విజయం సాధించారు.2014 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధి మున్ మున్ సేన్ చేతిలో  బాసుదేవ్ ఆచార్య ఓటమి పాలయ్యారు. 

తన చిన్నతనంలో  బాసుదేవ్ ఆచార్య  అనేక కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్నారు.  కార్మిక సంఘాల ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. పశ్చిమబెంగాల్ రైల్వే కాంట్రాక్టర్ లేబర్ యూనియన్, ఎల్ఐసీ ఏజంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, డీవీసీ  కాంట్రాక్టర్ వర్కర్స్  యూనియన్లనకు ఆయన  అధ్యక్షుడిగా ఉన్నారు.సీఐటీయూ  జనరల్ కౌన్సిల్, వర్కింగ్ కమిటీ సభ్యుడిగా కూడ బాసుదేవ్ ఆచార్య కొనసాగుతున్నారు.  అనేక పార్లమెంటరీ కమిటీల్లో బాసుదేవ్ ఆచార్య పనిచేశారు.  25 ఏళ్ల పాటు రైల్వే స్టాండింగ్ కమిటీలో  బాసుదేవ్ ఆచార్య సభ్యుడిగా ఉన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios