డైలీహంట్, జోష్ యాప్‌ల మాతృ సంస్థ వర్స్ ఇన్నోవేషన్ (VerSe Innovation) కీలక ప్రకటన చేసింది. తమ తర్వాతి దశ వృద్ధి కోసం, పాలనా వ్యవహారాలను బలోపేతం చేసేందుకు ప్రముఖ ఫైనాన్షియల్ నిపుణుడు పి.ఆర్. రమేశ్‌ను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గాా నియమించింది.

భారతీయ స్థానిక భాషల్లో కంటెంట్ అందించే ప్రముఖ సంస్థ VerSe Innovation లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. డైలీ హంట్ (Dailyhunt) వంటి ప్రముఖ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రజలకు వార్తలు, ఇతర సమాచారాన్ని అందించే ఈ సంస్థకు కొత్త డైరెక్టర్ నియమితులయ్యారు. ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ పి.ఆర్ రమేష్ ను ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నియమించుకుంది. 

ఫైనాన్షియల్ విభాగంలో రమేష్ కు విశేష అనుభవం ఉంది. ఆయన గత 40 ఏళ్లుగా చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. గతంలో డెలాయిట్ ఇండియా ఛైర్మన్ గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. అంతేకాదు డెలాయిట్ గ్లోబల్ బోర్డులో కూడా రమేష్ పనిచేశారు. ప్రస్తుతం అనేక సంస్థల్లో రమేష్ బోర్డు సభ్యులుగా పనిచేస్తున్నారు.

ఎవరీ పి.ఆర్. రమేశ్? ఎందుకింత ప్రాధాన్యం?

పి.ఆర్. రమేశ్ ఫైనాన్షియల్ రంగంలో చాలా పెద్ద పేరు. తన కెరీర్‌లో ఎయిర్ ఇండియా (Air India), సిప్లా (Cipla), నెస్లే ఇండియా (Nestlé India), లార్సెన్ & టూబ్రో (Larsen & Toubro), ఐటీసీ హోటల్స్ (ITC Hotels), తేజస్ నెట్‌వర్క్స్ (Tejas Networks) వంటి ఎన్నో పెద్ద కంపెనీలకు గవర్నెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ విషయాల్లో సలహాలు ఇచ్చారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2022-23లో ఏషియన్ సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ & సస్టైనబిలిటీ నుంచి "బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్" అవార్డు కూడా అందుకున్నారు. అంతేకాదు సెబీ (SEBI), ఆర్‌బీఐ (RBI), ఐఆర్‌డీఏ (IRDA) వంటి ప్రభుత్వ సంస్థల సలహా కమిటీలలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించారు. ఆయన అనుభవం వర్స్ ఇన్నోవేషన్ బోర్డుకు మరింత బలాన్నిస్తుంది.

ఆడిట్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలేంటి?

వర్స్ ఇన్నోవేషన్‌లో ఆడిట్ కమిటీకి రమేశ్ నాయకత్వం వహిస్తారు. ఆయన ప్రధాన బాధ్యతలు ఇవే..

కంపెనీ ఆర్థిక రిపోర్ట్స్ (ఫైనాన్షియల్ రిపోర్టింగ్) విశ్వసనీయతను పర్యవేక్షించడం.

అంతర్గత నియంత్రణ, రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలను పర్యవేక్షించడం.

ప్రభుత్వ నియమ నిబంధనలను కంపెనీ పాటిస్తోందో లేదో చూడటం.

ఆడిట్ ప్రక్రియలను దగ్గరుండి చూసుకోవడం.

ఈ నియామకంతో కంపెనీ కార్యకలాపాల్లో క్రమశిక్షణ, దీర్ఘకాలికంగా కంపెనీ విలువ పెరగడం వంటివి సాధ్యమవుతాయి.

డిజిటల్ ఇండియాలో వర్స్ యాప్స్ పాత్ర

వర్స్ ఇన్నోవేషన్ టెక్నాలజీ డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. డైలీహంట్ ద్వారా కోట్లాది మందికి వారి సొంత భాషలో వారికి నచ్చిన వార్తలు, కంటెంట్‌ను అందిస్తోంది. ఇక జోష్ క్రియేటర్ల కోసం భారతదేశంలోనే నంబర్ 1 యాప్‌గా నిలిచింది.

వీటితో పాటు నెక్స్‌వర్స్.ఏఐ (NexVerse.ai), డైలీహంట్ ప్రీమియం, జోష్ ఆడియో కాలింగ్, స్టోరీస్, వర్స్ కొలాబ్ (VerSe Collab) వంటివి యూజర్లు, బ్రాండ్లు, కంటెంట్ మధ్య సంబంధాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. AI టెక్నాలజీని వాడటంలో ముందుండటం వల్లే వర్స్ ఇన్నోవేషన్ భారతదేశపు మొట్టమొదటి స్థానిక భాషా యూనికార్న్‌గా నిలిచింది.

పెట్టుబడిదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

వర్స్ ఇన్నోవేషన్‌లో CPP ఇన్వెస్ట్‌మెంట్స్, OTPP, QIA, సిగులర్ గఫ్, కార్లైల్ గ్రూప్, బెయిలీ గిఫర్డ్, గోల్డ్‌మన్ శాక్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్, సిక్వోయా క్యాపిటల్ ఇండియా వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. పి.ఆర్. రమేశ్ లాంటి అనుభవజ్ఞుడి నియామకంతో ఈ పెట్టుబడిదారుల్లో కంపెనీపై నమ్మకం మరింత బలపడుతుంది.

కంపెనీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి?

ఈ నియామకంపై వర్స్ ఇన్నోవేషన్ సహ-వ్యవస్థాపకుడు ఉమంగ్ బేడీ మాట్లాడుతూ, "ఒక కంపెనీ విజయానికి పటిష్టమైన పాలన, ఆర్థిక క్రమశిక్షణ పునాది లాంటివి. పి.ఆర్. రమేశ్ అనుభవం మా బోర్డు పనితీరును, ఆడిట్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, బలంగా మార్చడంలో కీలకం కానుంది" అని అన్నారు.

పి.ఆర్. రమేశ్ స్పందిస్తూ, "భారత డిజిటల్ రంగంలో వర్స్ తనదైన ముద్ర వేసింది. కంపెనీ ఎదుగుతున్న కొద్దీ బాధ్యత కూడా పెరుగుతుంది. పటిష్టమైన పాలనా వ్యవస్థలు, ఆర్థిక నియంత్రణ, రిస్క్ మేనేజ్‌మెంట్‌ను అమలు చేయడానికి బోర్డు, మేనేజ్‌మెంట్ టీమ్‌తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను" అని తెలిపారు.