న్యూఢిల్లీ: రాజ్యసభ మార్షల్ డ్రెస్ కోడ్ పై వెల్లువెత్తుతున్న విమర్శలపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పందించారు. మార్షల్స్ కు కొత్తగా అమలులోకి తెచ్చిన యూనిఫాం పట్ల ఆర్మీ సిబ్బంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో డ్రెస్ కోడ్ పై పునరాలోచించనున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సూచించారు. డ్రస్ కోడ్ మార్పు నిర్ణయాన్ని పున:సమీక్షిస్తున్నట్లు తెలిపారు. 

ఇకపోతే మార్షల్స్ తమ డ్రస్ కోడ్ మార్చాలంటూ సెక్రటేరియట్ ను కోరారు. దాంతో మార్షల్స్ వస్త్రధారణపై అనేక సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకున్న అనంతరం సెక్రటేరియట్ వారికి సైనిక అధికారుల తరహా కొత్త డ్రెస్ కోడ్ అమలులోకి తీసుకువచ్చింది. 

నూతన డ్రస్ కోడ్ తో రాజ్యసభ 250వ సమావేశానికి హాజరయ్యారు మార్షల్స్. అయితే డ్రస్ కోడ్ పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. సైన్యంలో బ్రిగేడర్ ర్యాంక్ అంతకంటే పై స్థాయి అధికారులు ధరించే యూనిఫాంను మార్షల్స్ ధరించడంపై మాజీ సైన్యాధిపతి జనరల్ వీపీ మాలిక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

మిలగరీ యూనిఫాంను మిలిటరీయేతర వ్యక్తులు ధరించడం చట్ట విరుద్ధం, భద్రతా రీత్యా ప్రమాదకరం అని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై రాజ్యసభ త్వరితగతిన చర్యలు తీసుకుంటుందని మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్ ట్వీట్ చేశారు.

మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్ ట్విట్టర్ కు తోడు రాజ్యసభలో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. డ్రస్ కోడ్ పై అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పందించాల్సి వచ్చింది. డ్రస్ కోడ్ పై పున:సమీక్షించాలని సెక్రటేరియట్ కు సూచించినట్లు తెలిపారు వెంకయ్యనాయుడు.   

సైన్యంలో బ్రిగేడర్ ర్యాంక్ అంతకంటే పై స్థాయి అధికారులు ధరించే యూనిఫాంను మార్షల్స్ ధరించడంపై మాజీ సైన్యాధిపతి జనరల్ వీపీ మాలిక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో వెంకయ్యనాయుడు యూనిఫాంపై పున: సమీక్షించాలని ఆదేశించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

థౌజంట్ హుడ్స్ నవలను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య...

అమిత్ షా కు వెంకయ్య షాక్: ఏ ఒక్క భాషనో ఇతరులపై రుద్దొద్దంటూ ప్రకటన.