వారణాసిలో వరదలు పొంగిపొర్లుతున్నాయి. గంగానది వరదకు వారణాసి జలమయమైంది. ప్రధాన రహదారులు నీట మునిగాయి. ఇటీవలి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. పవిత్రపుణ్య క్షేత్రమైన వారణాసిలో పలు ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. బహుళ అంతస్తుల భవనాలు సైతం ముంపునకు గురయ్యాయి.

దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీస అవసరాలు కూడా లభించక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో... వరదల్లో చిక్కుకున్న ప్రజలను సహాయం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగారు. కాగా... ఎన్డీఆర్ఎఫ్ ప్రజలకు రిలీఫ్ మెటీరియల్ అందిస్తుండగా.... వరద తాకిడికి ఓ గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పలువురు గాయాలపాలయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా... దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.