ముఖేష్ అంబాని ఇంటి ముందు కారులో పేలుడు పదార్ధాల కేసు నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు హోంమంత్రిపై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరం బీర్ సింగ్ ఆరోపణలు చేశారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు.
ముంబై: ముఖేష్ అంబాని ఇంటి ముందు కారులో పేలుడు పదార్ధాల కేసు నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు హోంమంత్రిపై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరం బీర్ సింగ్ ఆరోపణలు చేశారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు.
సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.ఉద్దవ్ ఠాక్రే సర్కార్ ను మాజీ పోలీస్ కమిషనర్ చేసిన ఆరోపణలు తీవ్ర వివాదంలోకి నెట్టాయి.
ముంబై పోలీస్ కమిషనర్ పదవి నుండి తప్పించిన తర్వాతే ముఖేష్ అంబానీ ఇంటి ముందు బాంబు కేసులో లోపాలున్నాయని పరంబీర్ సింగ్ ఆరోపణలు చేయడాన్ని శరద్ పవార్ ప్రశ్నించారు. అంబానీ ఇంటి ముందు బాంబు కేసు విషయంలో ఎటీఎస్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత హిరెన్ ను ఎవరు చంపారు ఎందుకు చంపారని ఆయన పవార్ అడిగారు.
అంబానీ కేసులో ముంబై ఎటీఎస్ అధికారుల దర్యాప్తు సరైన దిశలో ఉందన్నారు. అయితే దాని నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు పరంబీర్ సింగ్ ఆరోపణలు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.
హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. హోంమంత్రి, సచిన్ వాజేలు కలుసుకొన్నారనే విషయంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 5 నుండి మంత్రి ఆసుపత్రిలో ఆ తర్వాత తన నివాసంలో ఐసోలేషన్ లో ఉన్నాడని శరద్ పవార్ చెప్పారు.
ముంబై పోలీస్ కమిషనర్ పదవి నుండి తప్పించిన తర్వాత పరంబీర్ సింగ్ హోంగార్డ్స్ శాఖకు బదిలీ చేశారు. హోంమంత్రి పోలీసుల విధి నిర్వహణలో జోక్యం చేసుకొన్నారని ఆయన ఆరోపించారు.
హోంమంత్రితో పాటు సచిన్ వాజేలు ప్రతి నెల రూ. 100 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారని ఈ మేరకు తమపై ఒత్తిడి తెచ్చారని సీఎంకు మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ లేఖ రాశారు.
