గుజరాత్‌లో దీపావళి నాడే రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిన్న రాత్రి 12.45 గంటల ప్రాంతంలో రెండు వర్గాలు తీవ్రంగా దాడులు చేసుకున్నాయి. స్ట్రీట్ లైట్స్ ఆఫ్ చేసి దాడులు చేశారు. ఇది ప్రీ ప్లాన్డ్ ఘటనే అని పోలీసులు అనుమానిస్తున్నారు.
వడోదర: గుజరాత్‌లో దీపావళి రోజే రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాత్రి క్రాకర్స్ కాల్చారు. ఆ తర్వాత రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, రాళ్లు రువ్వుకున్నారు. అక్కడే ఉన్న వాహనాకలు నిప్పు పెట్టారు. పోల్‌పై లైట్లు ఆఫ్ చేసి మరీ దాడులు చేశారు. అక్కడికి వచ్చిన పోలీసు బలగాలపై పెట్రోల్ బాంబు విసిరేశారు. ఇదంతా అనుకోకుండా జరిగిన గొడవలాగా లేదని, పక్కా ప్రణాళికతోనే అల్లర్లు జరిగినట్టు గుజరాత్ పోలీసులు అనుమానిస్తున్నారు.
వీధి దీపాలు ఆర్పేసి ఆ తర్వాత పెట్రోల్ బాంబులు విసరడం చూస్తుంటే ఇది ప్రీ ప్లాన్డ్ అటాక్‌గానే సూచనలు వస్తున్నాయని పోలీసులు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర త్రివేది కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ఈ ఘటనను దర్యాప్తు చేయడానికి వడోదర పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏరియా చాలా సెన్సిటివ్ ఏరియా అని పోలీసులు తెలిపారు. గడిచిన నాలుగు నెలల్లో ఇదే ఏరియాలో నాలుగు సార్లు ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయని వివరించారు.
ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన 19 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు మంగళవారం వెల్లడించారు. పోలీసులపై పెట్రోల్ బాంబ్ విసిరిన నిందితుడినీ అదుపులోకి తీసుకున్నారు.
Also Read: గుజరాత్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు.. రాళ్లు విసిరిన మూక.. 40 మంది అరెస్టు
వడోదరలో రాత్రి 12.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫైర్ క్రాకర్స్ కాలుస్తుండగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. రాకెట్ బాంబులను ఒకరి పై మరొకరు విసిరారు. రెండు వర్గాలకు చెందిన వారు ఒకరిపై మరొకరు రాళ్లు విసిరారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత అక్కడే ఉన్న వాహనాలు, ఇతరుల ఆస్తులను ధ్వంసం చేశారు. ఆగ్రహంతో ఉన్న మూకలో ఒకరు అక్కడి వీధి దీపాలకు కరెంట్ సరఫరాను నిలిపేసినట్టు స్థానికులు తెలిపారు. తద్వారా వారిని ఎవరూ గుర్తుపట్టకుండా ఉంటుందని వారు భావించినట్టు తెలుస్తున్నది.
ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులో ఉన్నట్టు పోలీసులు వివరించారు. ఘటన గురించి తెలుసుకోవడానికి సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు మొదలుపెట్టినట్టు వివరించారు. దోషులను పట్టుకునే పనుల్లో ఉన్నారు.
