Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు.. రాళ్లు విసిరిన మూక.. 40 మంది అరెస్టు

గుజరాత్‌లోని వడోదరలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు వర్గాలకు చెందిన 40 మందిని అరెస్టు చేశారు.
 

communal clash broke out in gujarat, 40 arrested
Author
First Published Oct 4, 2022, 1:08 PM IST

అహ్మదాబాద్: గుజరాత్‌లోని వడోదరలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు రాజుకున్నాయి. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడానికి ముందే పోలీసులు రంగంలోకి దిగారు. 40 మందిని అరెస్టు చేశారు. ఈ రెండు వర్గాలు వేర్వేరు మతాలకు చెందినవారు. 

ఈ ఘర్షణ లో వడోదరలోని సావ్లీ టౌన్ కూరగాయల మార్కెట్‌లో చోటుచేసుకున్నాయి. వడోదర రూరల్ పోలీసు పీఆర్ పటేల్ ఈ ఘటనపై మాట్లాడారు. ‘త్వరలో ఓ ముస్లిం పండుగ వస్తున్నది. ఇందుకోసం స్థానికంగా ఉండే ఓ గ్రూపు సభ్యులు ఒక ఎలక్ట్రిక్ పోల్‌కు వారి మతాన్ని వెల్లడించే జెండాను కట్టారు. అయితే, అక్కడే సమీపంలో ఓ గుడి కూడా ఉన్నది. దీంతో వేరే మతానికి చెందిన వారు అక్కడికి వెళ్లి జెండా తొలగించాలని కోరారు. ఆ జెండ తమ భావోద్వేగాలను దెబ్బ తీస్తున్నదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆ రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి’ అని ఆయన వివరించారు.

ఈ ఘర్షణల్లో రాళ్లు కూడా రువ్వారు. దీంతో సమీపం లోని వాహనాలు ధ్వంసం అయ్యాయి. 

ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశా మని వడోదర పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇరు వర్గాలకు చెందిన 25 మంది, 15 మందిని అరెస్టు చేశామని వివరించారు. ప్రస్తుతం పోలీసు పెట్రోలింగ్ జరుగుతున్నదని చెప్పారు.

ప్రస్తుతం పరిస్థితులన్నీ తమ అధీనంలో ఉన్నాయని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios