ఉత్తరప్రదేశ్ లో ఓ బీజేపీ వీరాభిమాని దారుణ హత్యకు గురయ్యాడు. బాబర్ అనే అతను బీజేపీ విజయోత్సావాల సందర్భంగా స్వీట్లు పంచుతుంటే దాడి చేసి చంపేశారని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉత్తరప్రదేశ్ : BJP వీరాభిమాని ఒకరు దారుణ murderకు గురి కావడం పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా ఉంది. బిజెపికి మద్దతు ఇవ్వడం.. ఆపై ఎన్నికల విజయోత్సవ సంబరాలు పాల్గొనడంతో చుట్టుపక్కల వాళ్ళు కోపంతో అతనిపై దాడి చేసి చంపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యున్నత దర్యాప్తుకు ఆదేశించారు.
పోలీసుల కథనం ప్రకారం మార్చి 20న ఆదివారం ఖుషినగర్ కథార్ ఘరి గ్రామంలో బాబర్ అలీ(25) అనే యువకుడిపై స్థానికులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బాబర్ ను లక్నోలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ.. వారం తర్వాత బాబర్ కన్నుమూశాడు. అయితే అతని మృతదేహాన్ని పోలీసులు స్వస్థలానికి తీసుకురాగా నిందితులను అరెస్టు చేస్తేనేగాని అంత్యక్రియలకు ముందుకు వెళ్లమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. దీంతో న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వండతో... చివరకు బాబర్ అంత్యక్రియలు జరిగాయి.
బిజెపి హార్డ్ కోర్ ఫ్యాన్..
కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ప్రకారం.. ఆ యువకుడు బిజెపీకి వీరాభిమాని, మొన్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రచారం చేశాడు. అంతే కాదు మార్చి 10వ తేదీన ఫలితాల అనంతరం బిజెపి విజయంపై సంతోషంతో సంబరాల్లో పాల్గొన్నాడు కూడా, అయితే ఈ విషయమై తరచూ.. స్థానికులు అతనికి హెచ్చరికలు కూడా జారీ చేసేవారట. బిజెపికి మద్దతు ఇచ్చినా, ప్రచారంలో పాల్గొన్నా బాగోదు అని బెదిరించే వారట. ఈ క్రమంలో ఫలితాలు వచ్చిన రోజు స్వీట్లు పంచిన టైంలోనే స్థానికులతో పెద్ద వాగ్వాదం జరిగిందని బాబర్ కుటుంబం చెబుతుంది. ఈ విషయమై తాము కూడా సున్నితంగా వారించామని కానీ, అతను మాత్రం మొండిగా ముందుకు వెళ్లాడని బాబర్ తల్లి అంటోంది. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆ కుటుంబం ప్రభుత్వాన్ని కోరుతోంది.
ఇదిలా ఉండగా, యూపీ సిఎంగా పదవీస్వీకారం చేసిన తరువాత యోగి ఆదిత్యనాథ్ నూతన మంత్రులకు మంగళవారం శాఖాలను కేటాయించారు. గత శుక్రవారం లక్నోలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం యోగితో పాటు డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సోమవారం తొలుత.. సీఎం యోగి ఆదిత్యనాథ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా సభలో ప్రమాణ స్వీకారం చేశారు. విపక్ష నేత కూడా అయిన అఖిలేష్ సైతం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ రమాపతి శాస్త్రి ప్రమాణస్వీకారం చేయించారు.
తదనంతరం.. కొత్తగా చేరిన మంత్రులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శాఖలను కేటాయించారు. గత శుక్రవారం లక్నోలో జరిగిన ప్రమాణస్వీకర కార్యక్రమంలో ఇద్దరు మంత్రులు డిప్యూటీ సీఎంలు గా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం యోగి, హోంతోపాటు 24 శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. డిప్యూటీ బ్రజేష్ పాఠక్‌కు వైద్య, విద్య శాఖను కేటాయించారు. మరో యాభై మంది ఎమ్మెల్యేలను క్యాబినెట్ మంత్రులుగా, రాష్ట్ర మంత్రిగా, స్వతంత్ర బాధ్యతతో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
