మహారాష్ట్రకు చెందిన 16 ఏళ్ల బాలిక వరుసగా 127 గంటల పాటు డ్యాన్స్ చేసి గిన్నిస్ నెలకొల్పింది. అంతకు ముందు ఈ రికార్డు నేపాల్ కు చెందిన బాలికపై ఉంది.
మహారాష్ట్రకు చెందిన 16 ఏళ్ల బాలిక వరుసగా ఐదు రోజుల పాటు డ్యాన్స్ చేసి గిన్నిస్ రికార్డు సృష్టించింది. లాతూర్ కు చెందిన సృష్టి సుధీర్ జగ్తాప్ మే 29 జూన్ 3 మధ్య 127 గంటల పాటు క్లాసికల్ ఇండియన్ స్టైల్ కథక్ లో నృత్యం చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పత్రికా ప్రకటన ప్రకారం.. ఈ మహారాష్ట్ర టీనేజ్ బాలిక తన కాలేజీ ఆడిటోరియంలో ఐదు రోజుల పాటు డ్యాన్స్ చేసి రికార్డు నెలకొల్పింది. దీంతో నేపాల్ నృత్యకారిణి బందనా నెలకొల్పిన 2018 రికార్డును బద్దలు కొట్టి అగ్రస్థానంలో నిలిచింది.
చెప్పులు కనిపించడం లేదంటూ మాజీ మేయర్ ఫిర్యాదు.. 4 వీధి కుక్కలను బంధించి, స్టెరిలైజ్ చేసిన అధికారులు
127 గంటల డాన్స్ మారథాన్ లో భాగంగా సృష్టి డ్యాన్స్ చేస్తూనే ఉందని అధికారికంగా నిర్ధారించడానికి జీడబ్ల్యూఆర్ జడ్జి స్వప్నిల్ దంగారికర్ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే నిబంధనల ప్రకారం ఇలా డ్యాన్స్ చేసే సమయంలో ప్రతీ గంటకు ఐదు నిమిషాల విరామం ఇస్తారు. విరామం తీసుకోవడం, తీసుకోకపోవడం అనేది ఆ నృత్యకారిణి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. అయితే సృష్టి ఈ బ్రేక్ ను సద్వినియోగం చేసుకున్నారు. రాత్రి నిద్రపోకుండా ఉండేందుకు కాఫీలు తాగారు. అలాగే తన తల్లిదండ్రులైన సుధీర్, సంజీవని జగ్తాప్ తో మాట్లాడేందుకు ఆమె ఈ బ్రేక్ లను ఉపయోగించుకున్నారు. కూతురును తాజాగా ఉంచడానికి ఆమె ముఖాన్ని నీటితో స్ప్రే చేశారు.
అమృత్ పాల్ సహాయకుడు, ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ అవతార్ సింగ్ ఖండా మృతి.. ఏమైందంటే ?
తన 15 నెలల సన్నద్ధతలో భాగంగా 126 గంటల చొప్పున రెండు డ్యాన్స్ మారథాన్లను ప్రదర్శించడంతో పాటు, ఈ టీనేజ్ డ్యాన్సర్ తన తాత బాబా మానేతో కలిసి యోగ నిద్రను అభ్యసించింది. అయితే అధికారిక 127 గంటల డ్యాన్స్ మారథాన్ ముగిసే సమయానికి ఆమె శరీరం స్పందించకుండాపోయింది. ‘‘నా శరీర భాగాలన్నీ గడ్డకట్టి నొప్పిగా అనిపించాయి. కానీ మానసికంగా నేను నా లక్ష్యం వైపు దృష్టి పెట్టాను’’ అని సృష్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించిన సమయంలో తెలిపారు. అయితే ఐదు రోజుల పాటు సాగిన ఈ ప్రయత్నం వెనుక తన ప్రేరణ భారతీయ సంస్కృతిని పెంపొందించడమేనని అని సృష్టి స్పష్టం చేశారు.
