ఉత్తరాఖండ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ధామ్‌లలో ఒకటైన కేదార్‌నాథ్ ధామ్ వద్ద హెలికాప్టర్ ఢీకొనడంతో రాష్ట్ర అధికారి ఒకరు మరణించారు. హెలి ఫ్యాడ్ వద్ద సెల్ఫీ తీసుకోవడానికి అధికారి ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలో హెలికాప్టర్ రెక్క అతడికి తాకడంతో మరణించాడని పోలీసులు తెలిపారు.
సెల్ఫీల మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు ఓ ప్రభుత్వ అధికారి. హెలికాప్టర్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తూ తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేదార్‌నాథ్ ధామ్‌లోని హెలిప్యాడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రభుత్వ అధికారి జితేంద్ర కుమార్ సైనీ ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీలో ఫైనాన్స్ కంట్రోలర్‌గా సేవలందిస్తున్నారు. కేదార్‌నాథ్ హెలిప్యాడ్‌ను పరిశీలించేందుకు అమిత్ సైనీ కెస్ట్రెల్ ఏవియేషన్ హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్ వెళ్లారు. ఈ క్రమంలో హెలిప్యాడ్ వద్ద జితేంద్ర కుమార్ సైనీ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు హెలికాప్టర్ టెయిల్ రోటర్ అతని తలకు తగిలింది. దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేదార్‌నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు జరిగిన ఈ ప్రమాదం సంచలనం సృష్టించింది.
పరిపాలన అధికారుల సమాచారం ప్రకారం.. ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఫైనాన్స్ కంట్రోలర్ చెందిన అమిత్ సైనీ రుద్రప్రయాగ్‌లో హెలికాప్టర్ బ్లేడ్ తగలడంతో మరణించారు. కేదార్‌నాథ్ హెలిప్యాడ్‌ను పరిశీలించేందుకు అమిత్ సైనీ కెస్ట్రెల్ ఏవియేషన్ హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్ వెళ్లారు. హెలిప్యాడ్‌పై దిగుతుండగా హెలికాప్టర్ బ్లేడ్ తగలడంతో అమిత్ సైనీ మృతి చెందినట్లు సమాచారం.
కేదార్‌నాథ్ యాత్ర ప్రారంభం
ఈసారి ఏప్రిల్ 25 నుండి కేదార్‌నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఇందుకోసం సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ దిశగా నిరంతరం కృషి చేస్తోంది. అదే సమయంలో, హెలికాప్టర్ సేవలకు సన్నాహాలు కూడా ప్రారంభించారు. హెలిప్యాడ్‌పై పేరుకుపోయిన మంచును తొలగించారు. UCADA అధికారులు కూడా ఇదే విషయాన్ని పరిశీలించడానికి కేదార్‌నాథ్ చేరుకున్నారు. ఈ తరహా ప్రమాదం జరిగినట్లు అక్కడి నుంచి సమాచారం అందుతోంది.
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 22న గంగోత్రి-యమునోత్రి పోర్టల్స్‌ను ప్రారంభించడంతో ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. అక్షియ తృతీయ రోజున గంగోత్రి , యమునోత్రి ధామ్ తలుపులు తెరుచుకున్నాయి. ఏప్రిల్ 25న కేదార్‌నాథ్ ధామ్, ఏప్రిల్ 27న బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకోనున్నాయి. ఉత్తరాఖండ్ టూరిజం శాఖ ప్రకారం.. 16 లక్షల మంది భక్తులు చార్ధామ్ యాత్ర కోసం నమోదు చేసుకున్నారు. నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. చార్ధామ్ యాత్రకు నమోదు చేసుకునే యాత్రికుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.
