Uttar Pradesh:  యూపీలో యోగీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.  నూత‌నంగా  ఏర్పాటు మదర్సాలకు నిధులు ఇవ్వకూడని యోగి క్యాబినేట్ నిర్ణయించింది. సీఎం ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ స‌మావేశంలో ఇప్ప‌టి వ‌ర‌కూ  రాష్ట్రంలో 560 మదర్సాలకు ప్రభుత్వం నిధులు ఇస్తున్నదని, కొత్తగా వచ్చే మదర్సాలకు నిధులు ఇవ్వబోమనిర్ణయం తీసుకుంది.   

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని యోగీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కొత్త మదర్సాలకు నిధులు ఇవ్వకూడని యోగి క్యాబినేట్ నిర్ణయించింది. సీఎం ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి డానిశ్‌ ఆజాద్‌ మీడియాకు వెల్లడించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్రంలో 560 మదర్సాలకు ప్రభుత్వం నిధులు ఇస్తున్నదని, కొత్తగా వచ్చే మదర్సాలకు నిధులు ఇవ్వబోమని తెలిపారు.

రాష్ట్రంలో మదర్సాలకు గ్రాంట్లు అందించే ప్రతిపాదనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. క్యాబినెట్ సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ జాబితా నుండి కొత్త మదర్సాలను మినహాయించే ప్రతిపాదనను ఆమోదించింది. ముఖ్యంగా.. బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మదర్సాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులందరికీ జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేసిన దాదాపు వారం తర్వాత కొత్త మదర్సాలకు గ్రాంట్‌లను తగ్గించే నిర్ణయం తీసుకుంది. 

రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ప్రతిపాదన మేరకు మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విష‌యంపై యూపీ మైనారిటీ రాష్ట్ర మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి వచ్చే గ్రాంట్‌లకు కొత్త మదర్సాలు ఏవీ అర్హత పొందవని అన్నారు. పాత మదర్సాలు ప్రభావితం కావనీ. ప్రస్తుత మదర్సాలలో విద్య నాణ్యతను మెరుగుపరచాలని కోరుకుంటున్నామని మంత్రి అన్నారు. నాణ్యతను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నామనీ, ఈ నిర్ణ‌యం వ‌ల్ల సామాన్య ముస్లిం వ్యక్తి ప్రయోజనాలు పొందుతున్నారని తెలిపారు. మదర్సాల ప్రారంభాన్ని అడ్డుకోవడం లేదని, పాత మదర్సాలకు గ్రాంట్లు అందజేస్తున్నామ‌నీ. మదర్సాల విద్యార్థులు జీవితంలో రాణించాలని కోరుకుంటున్నామని అన్సారీ తెలిపారు.

అంతకుముందు 2021-22 బడ్జెట్‌లో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మదర్సా ఆధునీకరణ పథకం కింద రూ. 479 కోట్లు కేటాయించింది. అధికారిక నివేదికల ప్రకారం, రాష్ట్రంలో 16,000 పైగా నమోదిత మదర్సాలు ఉన్నాయి, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. 16,000లో 558 మదర్సాలు ఎయిడెడ్‌గా ఉన్నాయి. ఇప్పుడు, గ్రాంట్ల జాబితా నుండి కొత్త మదర్సాలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మదర్సాల పనితీరుపై విచారణకు ఆదేశించింది.

 మదర్సాలలో జాతీయ గీతం తప్పనిసరి

గత వారం ప్రారంభంలో.. యుపిలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని మదర్సాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ తరగతులు ప్రారంభించే ముందు జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఉత్తర్వు మే 12న అమలు చేయబడింది. యూపీ మైనారిటీ రాష్ట్ర మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ ఈ ఉత్తర్వును ఆమోదించారు. మార్చి 24న జరిగిన యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్డర్ ను మే 9న ఆమోదించబడింది. 

ఆదేశం ప్రకారం, పాఠశాలలు జాతీయ గీతం- "జన గణ మన"తో పాటు గతంలో పాడిన మతపరమైన ప్రార్థనలతో కొనసాగుతాయి. ఈ ఆర్డర్ అన్ని గుర్తింపు పొందిన, ఎయిడెడ్ మరియు నాన్ ఎయిడెడ్ మదర్సాలలో వర్తిస్తుంది. 2017వ సంవత్సరంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ గీతం మరియు జెండా ఎగురవేయడాన్ని యుపి మదర్సా బోర్డు తప్పనిసరి చేసిన దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది.