Uttar Pradesh Rains: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో వ‌ర్ష బీభ‌త్సం కొన‌సాగుతోంది. యూపీలో గ‌త 24 గంటల్లో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు, పిడుగుపాటు వంటి చ‌ర్య‌ల కార‌ణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి. ప‌లు జిల్లాల్లో స్కూళ్ల‌కు సెల‌వు ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. లక్నో జిల్లా మేజిస్ట్రేట్ సూర్య పాల్ గంగ్వార్ పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా, తీవ్రమైన పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున అనవసరమైన బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేయాలని ప్రజలను కోరుతూ ఒక సలహా జారీ చేశారు. 

Uttar Pradesh rains-19 killed in 24 hours: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో వ‌ర్ష బీభ‌త్సం కొన‌సాగుతోంది. యూపీలో గ‌త 24 గంటల్లో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు, పిడుగుపాటు వంటి చ‌ర్య‌ల కార‌ణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి. ప‌లు జిల్లాల్లో స్కూళ్ల‌కు సెల‌వు ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. లక్నో జిల్లా మేజిస్ట్రేట్ సూర్య పాల్ గంగ్వార్ పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా, తీవ్రమైన పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున అనవసరమైన బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేయాలని ప్రజలను కోరుతూ ఒక సలహా జారీ చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్ లో గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు 19 మంది మృతి చెందారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల‌తో చాలా ప్రాంతాల్లో భారీగా వ‌ర్ష‌పు నీరు చేరింది. ప‌లు ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 40 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. వీటిలో మొరాదాబాద్, సంభాల్, కన్నౌజ్, రాంపూర్, హత్రాస్, బరాబంకి, కస్గంజ్, బిజ్నోర్, అమ్రోహా, బహ్రైచ్, లక్నో, బదౌన్, మైన్‌పురి, హర్దోయ్, ఫిరోజాబాద్, బరేలీ, షాజహాన్‌పూర్, కాన్పూర్, సీతాపూర్, ఫరూఖాబాద్, లఖింపూర్, ఫరూఖాబాద్, ఖాతీపూర్ ఉన్నాయి. హర్దోయిలో నలుగురు, బారాబంకీలో ముగ్గురు, ప్రతాప్‌గఢ్ , కన్నౌజ్లో ఇద్దరు చొప్పున, అమేథీ, డియోరియా, జలౌన్, కాన్పూర్, ఉన్నావ్, సంభాల్, రాంపూర్, ముజఫర్‌నగర్ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు.

ఈ నేపథ్యంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలనీ, విపత్తు బాధితులకు సహాయం అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభావిత జిల్లాల్లో అధికారులను ఆదేశించారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రాంతాల్లో సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ, నదీజలాల మట్టాలను నిరంతరం పర్యవేక్షించడం ప్రాధాన్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. పంట నష్టాన్ని అంచనా వేసి నిబంధనలకు అనుగుణంగా బాధిత రైతులకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిన అవసరం ఉందన్నారు. తూర్పు ప్రాంతంలో సెప్టెంబర్ 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, సెప్టెంబర్ 17 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై మ‌రిన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటోంది. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో సెప్టెంబర్ 17 వరకు వర్షాలు కురుస్తాయనీ, సెప్టెంబర్ 15 వరకు పిడుగుల హెచ్చరిక అమల్లో ఉంటుందని తెలిపింది. బారాబంకీలో రైలు పట్టాలపై నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒక ప్యాసింజర్ రైలును తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, తరువాత, రైళ్లు చాలా నెమ్మదిగా ముందుకు సాగడానికి అనుమతించారు. 

పరీక్షలు వాయిదా, స్కూళ్లు మూసివేత

లక్నో జిల్లా మేజిస్ట్రేట్ పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. తీవ్రమైన పిడుగులు పడే అవకాశం ఉన్నందున అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సలహా జారీ చేశారు. లక్నోలోని జిల్లా స్థాయి అధికారులందరూ వర్షాల వల్ల కలిగే సమస్యలను చురుగ్గా అంచనా వేస్తున్నారు. గోశాలలను కూడా తనిఖీ చేసి వాటి భద్రత కోసం ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. పలు జిల్లాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. గోమతి నగర్ లో భారీ వర్షాలకు ప్రధాన రహదారి కూలిపోవడంతో ట్రాఫిక్ మళ్లింపులు, ఉన్నతాధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. లఖింపూర్ ఖేరీలోని మొత్తం ఎనిమిది తహసీల్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా 8వ తరగతి వరకు అన్ని పాఠశాలలను మూసివేశారు. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన మార్గాలు, అప్రోచ్ రోడ్లు జలమయమయ్యాయి. దీంతో అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సోమ, మంగళవారాల్లో జరగాల్సిన నిపున్ అసెస్మెంట్ టెస్ట్ (నాట్) వాయిదా పడింది.

బల్లియా, బారాబంకి, బదౌన్, ఫరూఖాబాద్, కస్గంజ్, ఖేరీ, ఖుషీనగర్, మౌ, మీరట్, ముజఫర్‌నగర్ జిల్లాల్లో వరదల కారణంగా 10 జిల్లాల్లోని 19 తహసీల్‌లు ప్రభావితమయ్యాయని రిలీఫ్ కమిషనర్ కార్యాలయ అధికారులు తెలిపారు. అలాగే, 173 గ్రామాలు, 55,982 జనాభా ప్రభావితమైంది. బాధితుల‌కు మధ్యాహ్న భోజన ప్యాకెట్లు, ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రమాదకర స్థాయికి మించి నదులు ప్రవహించడం లేద‌ని తెలిపారు. అయితే, నీటిమ‌ట్టం క్ర‌మంగా పెరుగుతున్న ప‌రిస్థితులు ఉన్నాయ‌ని పేర్కొన్నారు.