Asianet News TeluguAsianet News Telugu

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో రూ.2,723 కోట్ల విలువైన పవర్ ప్రాజెక్టులు ప్రారంభం

Energy Day: ఉత్తరప్రదేశ్‌లో ఎలక్ట్రిసిటీ ఫెస్టివల్, ఎనర్జీ డే సందర్భంగా 12 విద్యుత్ సబ్‌స్టేషన్లు,  ట్రాన్స్‌మిషన్ సెంటర్‌లను ప్రారంభించగా, మరో ఐదింటికి శంకుస్థాపన చేశారు.
 

Uttar Pradesh: Power projects worth Rs 2,723 crores started in Uttar Pradesh
Author
Hyderabad, First Published Jul 31, 2022, 5:57 AM IST

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్‌లో 12 విద్యుత్ సబ్‌స్టేషన్లు, ప్రసార కేంద్రాలను ప్రారంభించగా, ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్యాలో భాగంగా జరిగిన విద్యుత్ పండుగ, ఇంధన దినోత్సవం సందర్భంగా మరో ఐదింటికి శంకుస్థాపనలు జరిగాయి. శనివారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ఈ ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.2723.20 కోట్లుగా అంచనా వేశారు.

ఈ సందర్భంగా ప్రజలను అభినందిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతతో కూడిన నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో భారీ పురోగతి సాధించిందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి విద్యుత్‌ సౌకర్యం లేని 1.21 లక్షల గ్రామాలకు గత ఐదేళ్లలో విద్యుదీకరణ చేశామని, గత ఐదు సంవత్సరాల‌లో సౌభాగ్య యోజన కింద రాష్ట్రంలోని నిరుపేదలకు 1.43 కోట్ల ఉచిత విద్యుత్ కనెక్షన్లు కూడా ఇచ్చామని ఆయన చెప్పారు. 

గత ప్రభుత్వాల హయాంలో యూపీలో నాలుగు వీఐపీ జిల్లాలు ఉన్నాయని, మిగిలిన 71 జిల్లాలకు విద్యుత్ నిరాకరించబడింద‌న్నారు. అక్కడి ప్రజలు అంధకారంతో ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి యోగి పేర్కొన్నారు. అయితే, నేడు ప్రతి జిల్లా VIP జిల్లా అయినందున ప్ర‌త్యేక‌ VIP జిల్లాలు లేవని తెలిపారు. గత ఐదేళ్లలో ప్రజలకు ఎలాంటి వివక్ష లేకుండా కరెంటు అందించామ‌ని వెల్ల‌డించారు. దీన్నే ప్రజాస్వామ్యం అంటున్నాం అని యోగి ఆదిత్యానాథ్ అన్నారు. 

ప్రస్తుతం జిల్లా కేంద్రంలో 23 నుంచి 24 గంటలు, తహసీల్‌ హెడ్‌క్వార్టర్స్‌లో 20-22 గంటలు, గ్రామాల్లో 16 నుంచి 18 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు సీఎం  యోగి తెలిపారు. దేశం అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటున్నందున రాబోయే 25 సంవత్సరాలలో ఉజ్వల్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడటానికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి విద్యుత్ అందించడమే రాబోయే ఐదేళ్లలో త‌మ లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని తెలిపారు. ఇంధన శాఖను స్వావలంబనగా మార్చేందుకు బిల్లింగ్, కనెక్షన్ వ్యవస్థను పటిష్టం చేయాలని ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ అధికారులను సీఎం యోగి కోరారు.

 

కొత్తగా ప్రారంభించబడిన ట్రాన్స్‌మిషన్/డిస్ట్రిబ్యూషన్ సబ్‌స్టేషన్‌లు రాస్రా (బల్లియా), బబినా (ఝాన్సీ), మల్వాన్ (ఫతేపూర్), అయోధ్య, అజీజ్‌పూర్ (షాజహాన్‌పూర్), దుల్హీపర్ (సంత్ కబీర్‌నగర్), మంధాత (ప్రతాప్‌గఢ్), బిలోచ్‌పురా (బాగ్‌పట్), మీర్గంజ్ (బరేలీ), కైలా (చిత్రకూట్), బాగ్‌పత్ ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తాయి.  నాలెడ్జ్ పార్క్-5, ఎకోటెక్-8 & 10, జల్పురా, గ్రేటర్ నోయిడా (గౌతమ్ బుద్ నగర్), షోహ్రత్‌గఢ్ (సిద్ధార్థనగర్) వద్ద వివిధ సామర్థ్యాల ప్రసార/పంపిణీ సబ్‌స్టేషన్‌లకు పునాది రాయి వేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios